Pawan Kalyan: వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి బయలుదేరిన పవన్ కళ్యాణ్.. చాలా కాలం తర్వాత భార్యతో కలిసి..

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇటలీకి బయలుదేరారు. శుక్రవారం తన భార్య షాలితో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు నితిన్. ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీకి బయలుదేరారు. వీరిద్దరు కలిసి ఇటలీకి వెళుతుండగా విమానాశ్రయంలో కనిపించారు. పవర్ స్టార్ ఎరుపు, ఆకుపచ్చ హాఫ్-స్లీవ్ చెకర్డ్ షర్ట్‌లో కనిపించారు. ఆయన చేతిలో పుస్తకం కూడా పట్టుకుని ఉన్నారు. ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్ కనిపించిన

Pawan Kalyan: వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి బయలుదేరిన పవన్ కళ్యాణ్.. చాలా కాలం తర్వాత భార్యతో కలిసి..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 28, 2023 | 2:07 PM

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా, అల్లు కుటుంబాలు ఇటలీకి చేరుకున్నారు. మరోవైపు చాలా రోజులుగా రామ్ చరణ్, తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి అక్కడే ఉండి వరుణ్ తేజ్ పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇటలీకి బయలుదేరారు. శుక్రవారం తన భార్య షాలితో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు నితిన్. ఇక ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఇటలీకి బయలుదేరారు. వీరిద్దరు కలిసి ఇటలీకి వెళుతుండగా విమానాశ్రయంలో కనిపించారు. పవర్ స్టార్ ఎరుపు, ఆకుపచ్చ హాఫ్-స్లీవ్ చెకర్డ్ షర్ట్‌లో కనిపించారు. ఆయన చేతిలో పుస్తకం కూడా పట్టుకుని ఉన్నారు. ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు అభిమానులతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఆకట్టుకుంది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అభిమానులతో పాటు పరిశ్రమలో చాలా ఉత్సాహం, సందడిని సృష్టించింది. ఇటలీలోని టుస్కానిలో వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే వరుణ్, లావణ్య.. వీరితోపాటు నిహారిక సైతం ఇటలీకి వెళ్లారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ సంవత్సరం జూన్‌లో నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ 30 నుంచి వీరి మ్యారెజ్ సెలబ్రెషన్స్ స్టార్ట్ కానున్నాయి. నవంబర్ 1 న వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, ఇతర కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హజరుకానున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల సముద్రఖని దర్శకత్వం వహించిన BRO చిత్రంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించారు. అలాగే డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న హరి హర వీర మల్లు చిత్రంలో కనిపించనున్నారు. ఇకే కాకుండా డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయిక. ఈ చిత్రం 2016లో అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన తమిళ చిత్రం థెరికి అధికారిక రీమేక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..