Oy Movie: ‘ఓయ్’ రీరిలీజ్.. డైరెక్టర్‌ను అంత మాట అనేసిన నెటిజన్.. ఆనంద్ రంగా రియాక్షన్ ఏంటేంటే..
అందులో 'ఓయ్' ఒకటి. అప్పట్లో ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పటికీ ఈ పాటలకు ఉండే క్రేజ్ వేరెలెవల్. టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్, షామిలి జంటగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ మిక్డ్స్ టాక్ అందుకుంది. అనుకున్నంత స్థాయిలో మెప్పించకోపోయినా.. యూత్ కు కనెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నెట్టింట ఓయ్ మూవీ గురించి చర్చ జరుగుతుంది.

రీరిలీజ్ ట్రెండ్ మళ్లీ మొదలైంది. కొన్నాళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించిన చిత్రాలను మళ్లీ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి. అప్పట్లో డిజాస్టర్ అయిన మూవీస్.. ఇప్పుడు రీరిలీజ్ అయ్యాక సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరికొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. అందులో ‘ఓయ్’ ఒకటి. అప్పట్లో ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పటికీ ఈ పాటలకు ఉండే క్రేజ్ వేరెలెవల్. టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్, షామిలి జంటగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ మిక్డ్స్ టాక్ అందుకుంది. అనుకున్నంత స్థాయిలో మెప్పించకోపోయినా.. యూత్ కు కనెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నెట్టింట ఓయ్ మూవీ గురించి చర్చ జరుగుతుంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారని.. అటు యూఎస్ లోనూ ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ లిమిట్స్ క్రాస్ చేసి కామెంట్ చేశాడు. హద్దులు దాటి మారి డైరెక్టర్ ను ఫన్నీగా తిట్టాడు. ‘ఒరేయ్ గుండు నాయాలా.. ఇంత మంచి సినిమాను తీసి ఎక్కడికి పోయావ్ రా’ అంటూ కామెంట్ చేశాడు. అయితే ఇది చూసిన డైరెక్టర్ ఆనంద్ రంగా స్పోర్టివ్ గా తీసుకుంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన నెటిజన్ సారీ సార్ అంటూ క్షమాపణలు చెప్పాడు. మిమ్మల్ని నోటికొచ్చినట్లు అన్నాను అంటూ రిప్లై ఇవ్వగా.. అది నిజమే కదా ? అంటూ సింపుల్ గా క్లారిటీ ఇచ్చేశాడు ఆనంద్ రంగా. ఇక డైరెక్టర్ రియాక్షన్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇంత స్పోర్టివ్ గా తీసుకున్నాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఓయ్ సినిమాకు ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధార్థ్, బేబీ షామిలి జంటగా నటించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమా 2009 జూలై 3న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ అందుకుంది. మొత్తం పది కోట్లతో నిర్మించిన ఈ మూవీ రూ. 43 కోట్లు రాబట్టింది. అయితే సిద్ధార్థ్, షామిలి జోడి మెప్పించినా.. విషాదాంతంగా కథ ముగియడంతో అంతగా క్లిక్ కాలేదు.
— Out of Context Telugu (@OutOfContextTel) February 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




