AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas-Jr.NTR: ప్రభాస్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా ?.. ఈ ఐడియా వేరెలెవల్.. అభిమానులకు పండగే ఇక..

ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న మరో సినిమా 'కల్కి 2898 AD'. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అనేక విషయాలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంటాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Prabhas-Jr.NTR: ప్రభాస్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా ?.. ఈ ఐడియా వేరెలెవల్.. అభిమానులకు పండగే ఇక..
Prabhas, Ntr
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2024 | 4:17 PM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేశాడు. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ నటవిశ్వరూపంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో డార్లింగ్ నెక్ట్స్ మూవీస్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న మరో సినిమా ‘కల్కి 2898 AD’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అనేక విషయాలు ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంటాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం కల్కి సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించనున్నారట. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, రాజమౌళి ముఖ్య పాత్రలలో కనిపించనున్నారని టాక్. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు బయటకు వచ్చింది. అతడే మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కల్కి చిత్రంలో తారక్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడనే వార్త ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ప్రభాస్ మహావిష్ణు దశావతారంలోని కల్కి పాత్రను పోషిస్తున్నాడట.. ఇక తారక్ మాత్రం హిందూ మైథలాజిలోని ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారట. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా ?.. పరుశురాముడు పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ గా మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో హనుమంతుడు, పరుశురాముడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్య, బలి చక్రవర్తి పాత్రలు కూడా కనిపించనున్నారని తెలుస్తోంది.

ప్రభాస్, తారక్ మొదటిసారి ఒకే సినిమాలో కనిపించనున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య సన్నివేశాలు ఉంటే ఇక బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అంటున్నారు. అయితే కల్కిలో తారక్ నటించనున్నాడనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.