AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhta Charitra: తెలుగు సినిమా హిస్టరీలో బెస్ట్ హీరో ఇంట్రడక్షన్.. మీరేమంటారు..

గత కొన్నేళ్లగా ఆర్జీవీ తీస్తున్న సినిమాలను చూస్తున్నాం.. ఒక దాంట్లో కూడా పసలేదు. విషయం లేదు. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లు.. సినిమాలు చేసుకుంటూ పోయారు. కానీ ఒకప్పటి ఆర్జీవీ వేరు. ఆయన తీసిన సినిమాలు వేరు. ఆయన సినిమాల్లోని కొన్ని షాట్స్ ఇప్పుడు చూసిన అంతే హై ఇస్తాయి.. అందులో ఒకటి ఈ సీన్...

Rakhta Charitra: తెలుగు సినిమా హిస్టరీలో బెస్ట్ హీరో ఇంట్రడక్షన్.. మీరేమంటారు..
Raktha Charithra Hero Intro
Ram Naramaneni
|

Updated on: Jan 23, 2025 | 10:54 AM

Share

టాలీవుడ్ అంటే కమర్షియల్.. టాలీవుడ్ అంటే హై బడ్జెట్… టాలీవుడ్ అంటే.. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్.. వాట్ నాట్. తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు గగనానికి ఎగసింది. ప్రస్తుత మేకర్స్, నిర్మాతలు, నటీనటులు సినిమా కోసం ప్రాణం పెడుతున్నారు. సినిమా కోసం కుటుంబానికి దూరంగా ఉంటూ.. అనుక్షణం కథనే స్మరిస్తూ.. మన ఇండస్ట్రీకి గొప్ప పేరు తెస్తున్నారు దర్శకులు. రాజమౌళి, నాగ్ అశ్విన్ లాంటి వాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంది కానీ… ఒకప్పుడు తెలుగు సినిమా దశ, దిశను మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో ఆయన తెలుగు సినిమా ముఖచిత్రాన్నే మార్చివేశారు. మూస ఫార్మాట్లకు చెక్ చెప్పి.. కొత్త పంథాను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఇప్పుడంటే ఈడుపోయిన చేనులా మారిపోయాడు ఆర్జీవీ కానీ ఒకప్పుడు ఆయన కాసుల పంట పడించే సినిమాలు ఎన్నో తీశారు. ఆయన అప్పటి మేకింగ్, టేకింగ్, ఎడిటింగ్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఆర్జీవీ తీసిన ఓ స్పెషల్ ఇంట్రడక్షన్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రక్తచరిత్ర సినిమాలో ప్రతాప్ రవి క్యారెక్టర్‌( వివేక్ ఒబేరాయ్)ను పాత చేతక్ స్కూటర్‌పై వస్తున్నట్లు రివీల్ చేశారు రామ్ గోపాల్ వర్మ ఉరఫ్ ఆర్జీవీ. అలా స్లో మోషనల్‌లో వివేక్ ఒబేరాయ్ ఎంట్రీ ఇస్తుంటే.. బ్యాగ్రౌండ్ సాంగ్, మ్యూజిక్.. మొత్తం ఆ విజువల్స్ చూస్తుంటే రొమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయ్… ఆ సీన్‌ చూసి థియేటర్‌లో ప్రేక్షకులు ఈలలు, గోలలతో మోతెక్కించారు. ఇప్పటికి ఆ విజువల్ చూసినా.. ఓ రేంజ్ హై వస్తుంది. ఏది ఏమైనా ఓ సాధారణ చేతక్ స్కూటీపై వచ్చే హీరోని ఈ రేంజ్‌లో ఎలివేట్ చేయడం ఆర్జీవీకే చెల్లింది. అయ్యా మహానుభావా.. నీ నుంచి ఇలాంటి సినిమాలే ఆశిస్తున్నాం. నువ్వు మారాను అంటున్నావ్.. నిజంగా మారితే బాగుండు…

పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రక్త చరిత్ర సినిమా తెరకెక్కింది.  ‘రక్తచరిత్ర’, ‘రక్తచరిత్ర-2’ విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత 2017లో వివేక్ ఒబేరాయ్ మళ్లీ ‘వినయ విధేయ రామ’తో తెలుగుతెరపై కనిపించారు. ఆ తర్వాత తెలుగు స్ట్రయిట్ సినిమా చేయలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.