Anasuya Bharadwaj: డబ్బులిచ్చి మరీ నా పై ట్రోల్స్ చేయిస్తున్నాడు.. అనసూయ షాకింగ్ కామెంట్స్
యాంకర్ గా నటిస్తూనే .. సినిమాల్లోనూ మంచి పాత్రలను అందుకుంటూ దూసుకుపోతుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పై వచ్చే విమర్శలకు ఘాటుగా రెస్పాండ్ అవుతూ నిత్యం నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటుంది.

స్టార్ యాంకర్ అనసూయ పేరు ఎప్పుడు ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంటుంది. ఆమె గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. యాంకర్ గా నటిస్తూనే .. సినిమాల్లోనూ మంచి పాత్రలను అందుకుంటూ దూసుకుపోతుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పై వచ్చే విమర్శలకు ఘాటుగా రెస్పాండ్ అవుతూ నిత్యం నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే అనసూయకు.. హీరో విజయ్ దేవర కొండ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్ ఇప్పటి నుంచి కాదు. విజయ్ కు ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చిపెట్టిన అర్జున్ రెడ్డి సినిమా టైం లో అనసూయ చేసిన కామెంట్స్ అప్పట్లో చర్చలకు దారి తీసింది. తాజాగా మరోసారి విజయ్ పై ఆమె చేసిన విమర్శలు ట్విట్టర్ వార్ కు దారితీశాయి.
అనసూయ పై విజయ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా విజయ్ ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లో ది విజయ్ దేవరకొండ అని ఉంటుంది. దీని పై అనసూయ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి. దాంతో అనసూయ పై విజయ్ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్స్ పై మరోసారి స్పందించింది అనసూయ.
గతంలో నేను విజయ్ మంచి ప్రెండ్స్.. అర్జున్ రెడ్డి టైం లో విజయ్ ఓ థియేటర్ కు వెళ్లి సినిమాలో ఉన్న పెద్ద బూతును మాట్లాడాడు. నాకు ఓ అమ్మగా ఆ అసభ్య పదాలు నచ్చలేదు. విజయ్ కూడా ఆ విషయం చెప్పను. కానీ నా పై ఆయన ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. అలాగే నేను మీకుమాత్రమే చెప్తా అనే సినిమా చేశా.. ఆ సినిమా సమయంలో నాకు షాకింగ్ విషయం తెలిసింది. విజయ్ దగ్గర పని చేస్తున్న ఒక వ్యక్తి డబ్బులిచ్చి మరి నా పై ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ కు తెలియకుండా అతని దగ్గర చేస్తోన్న వ్యక్తి నా పై ట్రోల్స్ చేస్తున్నాడు అని నేని అనుకోను..?




