Naatu Naatu Song: నాటు నాటు సాంగ్ స్టెప్పుల కోసం అన్ని టేక్స్ తీసుకున్నాం.. ఆసక్తికర విషయాలను చెప్పిన ఎన్టీఆర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్కు రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిన సంగతే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దోస్తీ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు పాట గురించి చెప్పాల్సిన పనిలేదు. ఊరమాస్ మ్యూజిక్… తారక్, చరణ్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. ఇక మరోసారి కిరవాణి తన మ్యూజిక్‌తో సత్తా చాటాడు. ప్రస్తుతం నాటు నాటు వీర నాటు పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రేక్షకుల చూపు మొత్తం చెర్రీ, తారక్ కలిసి వేసిన నాటు నాటు స్టెప్పులపైనే నిలిచిపోయింది. పాటలో కాళ్లను ఎడమవైపు, కుడివైపుతోపాటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉండాలి. ఈ స్టెప్స్ పర్ఫెక్ట్ గా రావడానికి చరణ్, తారక్ 15-18 టేక్స్ తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. స్టెప్స్ సరిగ్గా రావడం కోసం రాజమౌళి నరకం చూపించాడని.. తమ స్టెప్పులు కరెక్ట్ గా వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో డాన్స్ ఆపేడవాడని చెప్పాడు. దాదాపు 18 టేక్స్ తీసుకున్న తర్వాత రాజమౌళి ఒకే చెప్పారని.. ఇప్పుడు పాట విడుదలైన తర్వాత అదరు పొగుడుతూ ఉంటే.. రాజమౌళి విజన్ అర్థమైందన్నారు ఎన్టీఆర్. ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో రాజమౌళి దిట్ట. ప్రేక్షకులకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు, అందుకే ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్ట్ గా నిలిచారు అంటూ ప్రశంసించాడు తారక్. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది.
Chiranjeevi: మెగాస్టార్ రాకతో చిన్నప్పటి నా మాటలు నిజమయ్యాయి.. కార్తికేయ ఇంట్రెస్టింగ్ పోస్ట్..