AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగాస్టార్‌ రాకతో చిన్నప్పటి నా మాటలు నిజమయ్యాయి.. కార్తికేయ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

బ్యాచిలర్‌ లైఫ్‌కు వీడ్కోలు చెబుతూ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు యంగ్‌ హీరో 'ఆర్‌ ఎక్స్‌ 100' ఫేం కార్తికేయ. హైదరాబాద్‌లోని ఓ కల్యాణమండపం వేదికగా తన ప్రియురాలు లోహిత మెడలో

Chiranjeevi: మెగాస్టార్‌ రాకతో చిన్నప్పటి నా మాటలు నిజమయ్యాయి.. కార్తికేయ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..
Basha Shek
|

Updated on: Nov 23, 2021 | 10:07 PM

Share

బ్యాచిలర్‌ లైఫ్‌కు వీడ్కోలు చెబుతూ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు యంగ్‌ హీరో ‘ఆర్‌ ఎక్స్‌ 100′ ఫేం కార్తికేయ. హైదరాబాద్‌లోని ఓ కల్యాణమండపం వేదికగా తన ప్రియురాలు లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా పెళ్లికి హాజరై కార్తికేయ- లోహిత దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇవే ఫొటోలను మరోసారి ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కార్తికేయ ఓ ఆసక్తికర పోస్టును షేర్‌ చేశాడు

ఈ సందర్భంగా పెళ్లి వేడుకలో చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంటూ.. ‘నేను పెద్దయ్యాక హీరో అవుతాను. అప్పుడు చిరంజీవి కూడా నా వివాహానికి వస్తాడు. నేను చిన్నప్పుడు అమాయకంగా ఈ మాటలను అనేవాడిని. ఇప్పుడు నా వివాహ వేడుకకు వచ్చి నా మాటలను నిజం చేసిన చిరంజీవికి ధన్యవాదాలు. ఆయనపై ఎప్పటికీ అంతులేని ప్రేమాభిమానాలు ఉంటాయి’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు, నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..

Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే