Sumanth Akkineni: అక్కినేని సుమంత్ అహమా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హీరో వీడియో..
మళ్ళీ రావా సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు అక్కినేని హీరో సుమంత్. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఎదురుచూస్తున్న సుమంత్ మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు.
మళ్ళీ రావా సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు అక్కినేని హీరో సుమంత్. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఎదురుచూస్తున్న సుమంత్ మళ్లీ రావా సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మళ్లీ మొదలైంది అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాతో పాటు సుమంత్ మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. సుమంత్ హీరోగా ప్రశాంత్ సాగర్ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అహం రీబూట్’. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.
సుమంత్ ఆర్జే క్యారెక్టర్‌లో కనిపించనున్న అహం రీబూట్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు దర్శకుడు ప్రశాంత్ సాగర్. అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని చెబుతున్నాం అని దర్శకుడు ప్రశాంత్ సాగర్ చెప్పుకొచ్చారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా సుమంత్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.