Devara Review: దేవర మూవీ రివ్యూ.. ఎర్ర సముద్రం పోటెత్తింది..!

దేవర.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు.. మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవర తుడిచేసాడా..? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా..? పూర్తి రివ్యూలో చూద్దాం..

Devara Review: దేవర మూవీ రివ్యూ.. ఎర్ర సముద్రం పోటెత్తింది..!
Devara
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Sep 27, 2024 | 1:18 PM

మూవీ రివ్యూ: దేవర

నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శృతి మరాఠే తదితరులు

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కొరటాల శివ

దేవర.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు.. మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది. కల్కి తర్వాత విడుదలైన అతి పెద్ద సినిమా. జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా దేవర. మరి ఈ చిత్రం ఎలా ఉంది..? కొరటాల ఆచార్య జ్ఞాపకాలను దేవర తుడిచేసాడా..? తారక్ నమ్మకాన్ని ఈయన నిలబెట్టాడా..? పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఎర్రసముద్రంలో దేవర (జూనియర్ ఎన్టీఆర్) మాట శాసనం. నాలుగు ఊళ్ళకు ఆయన దేవర అంతే. వాళ్లకు సముద్రమే జీవనాధారం. ఆ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డ్‌కు తెలియకుండా దించుతుంటారు. తన వాళ్ల కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది. అదే ఊళ్ళో భైర (సైఫ్ అలీ ఖాన్) కూడా ఉంటాడు. దేవర చేసే పనులు భైరాకు నచ్చవు. కానీ దేవర సాయం లేకుండా ఏం చేయలేం అని భైరాకు తెలుసు. అందుకే అదును కోసం చూస్తుంటాడు. మరోవైపు తాము చేసేది తప్పు అని ఓ సమయంలో తెలుసుకున్న దేవర.. తన వాళ్లను కూడా సముద్రం పైకి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరి వాళ్లు భైరా తోడుగా వెళ్దామని చూస్తారు. కానీ వెళ్లిన వాళ్లను సముద్రానికే అంకితమిస్తుంటాడు దేవర. కానీ కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవర. అంతటి ధైర్యవంతుడికి వర (ఎన్టీఆర్) లాంటి పిరికివాడు కొడుకుగా ఉంటాడు. అదే ఊళ్ళో ఉండే రాయప్ప (శ్రీకాంత్) కూతురు తంగం (జాన్వీ కపూర్) వరను ఇష్టపడుతుంటుంది. అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతుంటాడు..? ఊరి వాళ్ల సమస్యలు దూరంగా ఉండే దేవర తీరుస్తుంటాడా..? అసలేమైంది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ..

కథనం:

కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. దేవరలోనూ ఇదే చెప్పాలని చూసాడు కొరటాల. ప్రతీ మనిషికి భయం అనేది కచ్చితంగా ఉండాలని.. అది లేకపోతే కష్టం అనేది ఇందులో శివ చెప్పాలనుకున్న మెసేజ్. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అవసరం లేదనేది దేవర కథ. ఈ సింగిల్ లైన్‌పైనే సినిమా అంతా తీసాడు కొరటాల. అందులో కొన్ని ఎత్తులున్నాయి.. మరికొన్ని పల్లాలు కూడా ఉన్నాయి. సినిమా మొదలవ్వడమే చాలా సీరియస్‌గా మొదలవుతుంది. తొలి 20 నిమిషాల తర్వాత కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. ఒక్కసారి తారక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను చాలా సీరియస్ నోట్‌లోనే తీసేకెళ్లిపోయాడు దర్శకుడు కొరటాల. ఇంటర్వెల్ వరకు స్లోగా నెరేషన్ ఉన్నా.. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అభిమానులకు పండగ. ఫస్టాఫ్‌లో దేవర కథ చెప్పిన శివ.. సెకండాఫ్ అంతా కొడుకు కథతోనే నడిపించాడు. యాక్షన్ సీక్వెన్సులు.. మరీ ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్సులు చాలా బాగున్నాయి. సెకండాఫ్ ఎక్కువగా కామెడీపై ఫోకస్ చేసాడు. రెండో ఎన్టీఆర్ పాత్ర అంతా అలాగే రాసుకున్నాడు కొరటాల. జాన్వీ కారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. తారక్, జాన్వీ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. చుట్టమల్లే సాంగ్ ఐ ఫీస్ట్ అంతే. క్లైమాక్స్‌కు తీసుకున్న లీడ్ బాగుంది. అప్పటి వరకు పిరికివాడిగా ఉన్న వర.. అసలెందుకు అలా ఉండాల్సి వచ్చింది.. దేవర రక్తం అయినా కూడా ఎందుకు అంత భయస్తుడిగా మారిపోయాడు అనేది చివర్లో బాగా చూపించాడు. ఈ సినిమాను కమర్షియల్ కోణంలో కాకుండా పక్కాగా తను అనుకున్న కథను తెరపై చూపించాలనే ఉద్దేశ్యంతోనే తీసాడు కొరటాల. అందుకే అక్కడక్కడా బాగా స్లో అనిపిస్తుంది. కానీ అభిమానులకు కావాల్సింది అయితే ఫుల్లుగానే ఇచ్చాడు కొరటాల. ముఖ్యంగా తారక్ కారెక్టరైజేషన్ బాగుంది. నెరేషన్ ఇంకాస్త ఫాస్టుగా ఉండుంటే మాత్రం కచ్చితంగా దేవర రేంజ్ మారిపోయి ఉండేది. క్లైమాక్స్‌లో మాత్రం బాహుబలిని గుర్తు చేసే ట్విస్ట్ ఇచ్చాడు కొరటాల.

నటీనటులు:

జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. ఇటు దేవర.. అటు వరగా రెండు పాత్రల్లోనూ కుమ్మేసాడు. జాన్వీ కపూర్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర బాగుంది. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా స్కోర్ చేసింది ఈ పాత్రే. దేవర భార్యగా శృతి మరాఠే కారెక్టర్ ఓకే. మిగిలిన పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్ అంతా బాగానే నటించారు. గెటప్ శ్రీను ఉన్నది ఒకట్రెండు సీన్స్ మాత్రమే. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

అనిరుధ్ సంగీతం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలేమో..? పాటలు పర్లేదు కానీ ఆర్ఆర్ మాత్రం స్థాయికి తగ్గట్లు అనిపించలేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఎడిటింగ్ పర్లేదు.. కానీ మూడు గంటల నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. కాస్త ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. దర్శకుడిగా కొరటాల శివ ఓ సీరియస్ కథను చెప్పాలనుకున్నాడు.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బుర్రలో ఉన్న ఆలోచనను స్క్రీన్ మీద సిన్సియర్‌గా పెట్టాడు. దానికోసం ఎక్కడా కమర్షియల్ పంథాలో వెళ్లలేదు. తను చెప్పాలనుకున్న కథనే కమర్షియలైజ్ చేసాడంతే. రైటర్‌గా అదరగొట్టిన శివ.. డైరెక్టర్‌గా ఇంకాస్త మెరిసుంటే దేవరకు తిరుగుండేది కాదు.

పంచ్ లైన్:

దేవర.. అభిమానులకు ఐ ఫీస్ట్.. ఎర్ర సముద్రం పోటెత్తింది..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!