Jr NTR: యంగ్ టైగర్ క్రేజ్ మాములుగా లేదుగా.. జపాన్‌లోనూ అదే అభిమానం.. తారక్ ఎమోషనల్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటించిన ఈసినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా..
ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్,ఎన్టీఆర్ కలిసి నటించిన ఈసినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించి మెప్పించారు. ఇక ఈ ఇద్దరు హీరోలు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి దేశవిదేశాలనుంచి ప్రశంశలు దక్కాయి. గతంలో హాలీవుడ్ మ్యాగజైన్స్ సైతం ట్రిపుల్ ఆర్ మూవీకి అవార్డ్స్ గ్యారంటీ అని అభిప్రాయ పడుతూ నివేదికలు ఇచ్చాయి.
తాజాగా ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయనున్నారు. సౌత్ సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. దాంతో త్వరలోనే ఆర్ఆర్ ఆర్ ను అక్కడ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ జపాన్ కు చేరుకున్నారు. జపాన్ ప్రేక్షకుల కోరిక మేరకు అక్కడ ఈ అక్టోబర్ 21న ఈ మూవీ భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ టీమ్ జపాన్ క్యాపిటల్ టోక్యోలో పాపులర్ లగ్జీరియస్ హోటల్ అయిన ది రిట్జ్ కార్ల్టన్ లో బస చేస్తున్నారు. అక్కడి హౌస్ కీపింగ్ టీమ్ తారక్ కు పెద్ద ఫ్యాన్స్. తారక్ ను చూడగానే ఫోటోల కోసం ఎగబడ్డారు. ఆటోగ్రాఫ్ లు సెల్ఫీలంటూ ఫ్యాన్ ఎన్టీఆర్ పై ప్రేమ కురిపించారు.
తారక్ మీద ఉన్న ప్రేమతో రాసిన లెటర్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఆయనకు చూపించారు. హౌస్ కీపింగ్ టీం తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు యంగ్ టైగర్ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Fan Moments For Hotel Staff In Ritz Carlton , Tokyo & Welcomed Our Hero & Showed Their Fondness..
There Is No Boundaries For Unconditional Love & Fanisam..#ManOfMassesNTR @tarak9999 #RRRInJapan #RRRMovie pic.twitter.com/s4D1FU2zMB
— ???? ??? ????? ? ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@TeamForTarak) October 19, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.