NBK 107: బాలయ్య ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. దీపావళి కానుకగా ఎన్‌బీకే107 నుంచి బిగ్ అప్‌డేట్..
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని రద్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అఖండలాంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు అనుగుణంగానే గోపిచంద్ చిత్రాన్ని అత్యంత..
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని రద్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అఖండలాంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు అనుగుణంగానే గోపిచంద్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్నా సినిమా టైటిల్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఎన్‌బీకే 107 టైటిల్ వర్కింగ్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. మునుపెన్నడూ కనిపించని లుక్‌లో బాలకృష్ణ వావ్ అనిపించేలా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపింది. దీపావళి కానుకగా అక్టోబర్ 21 సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుపై సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నారు.
The MASS euphoria intensifies ?#NBK107 title launch on the iconic Konda Reddy Buruju, Kurnool on October 21st at 8:15 PM ❤️?
NATASIMHAM #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @RishiPunjabi5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/Qe6zPYrVgp
— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2022
టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో తొలిసారి కొండారెడ్డి బురుజుపై సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా రెడ్డి గారు అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతీ హాసన్ నటిస్తుండగా విలన్ రోల్‌లో కన్నడ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..