మెగా హీరో కోసం ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

ఒక ఫ్యామిలీ హీరో ఫంక్షన్‌కు మరో ఫ్యామిలీ హీరో అతిథిగా రావడం టాలీవుడ్‌లో కొత్తేం కాదు. నిజానికి చెప్పాలంటే ఇటీవల కాలంలో ఈ పద్దతి బాగా పెరిగింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు హీరోలు ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో నటించాడు. ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ మూవీకి గ్రాండ్‌గా […]

  • Publish Date - 11:11 am, Wed, 27 March 19 Edited By:
మెగా హీరో కోసం ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

ఒక ఫ్యామిలీ హీరో ఫంక్షన్‌కు మరో ఫ్యామిలీ హీరో అతిథిగా రావడం టాలీవుడ్‌లో కొత్తేం కాదు. నిజానికి చెప్పాలంటే ఇటీవల కాలంలో ఈ పద్దతి బాగా పెరిగింది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు హీరోలు ఈ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో నటించాడు. ఏప్రిల్ 12న విడుదల కానున్న ఈ మూవీకి గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పెట్టాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ ఫంక్షన్ అతిథిగా ఎన్టీఆర్‌ను తీసుకురావాలని వారు భావిస్తున్నారట. అందుకోసం అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఫంక్షన్‌కు అతిథిగా వచ్చేందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటారని వారు భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా మారనున్నాడు.

నిజానికి చెప్పాలంటే ఈ ఈవెంట్‌కు చిరంజీవి గానీ, రామ్ చరణ్ గానీ అతిథిగా రావాల్సి ఉంది. కానీ ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న నేపథ్యంలో వీరు మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. అందుకే చిత్రలహరి ఫంక్షన్‌కు వారు దూరంగా ఉంటున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.