ఆ సమయంలో నా కెరీర్ క్లోజ్ అనుకున్నా.. ఐశ్వర్య రాజేశ్ కామెంట్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

14 June 2026

టాలీవుడ్ , కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి ఐశ్వర్య రాజేష్. దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

తన కొత్త సినిమా 'ఓ.. సుకుమారి' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఐశ్వర్య, తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. 

 ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ఒకానొక దశలో దాదాపు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు తనకు సరైన అవకాశాలు రాలేదని తెలిపింది.

ఆ సమయంలో నేను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యాను. నాకు మంచి అవకాశాలు రావడం లేదా? ఇక నా కెరీర్ ముగిసిపోయిందా? అని చాలాసార్లు బాధపడ్డాను.

నటిగా అవకాశాలు లేని సమయంలో పడే వేదన చాలా భయంకరంగా ఉంటుంది అని తన మనసులోని మాటను పంచుకుంది.

తనకి నచ్చని కథలను ఒప్పుకోవాలని అనిపించక, మంచి పాత్ర కోసం వేచి చూస్తూ ఖాళీగా ఉండటం ఆ సమయంలో ఎంతో కష్టంగా అనిపించిందట 

అయితే, తన కెరీర్‌లో ఆ క్లిష్ట సమయంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తనకు ఒక గొప్ప మలుపుగా నిలిచిందని ఐశ్వర్య వెల్లడించింది.