నిత్యా మీనన్.. తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చివరగా భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కొన్నాళ్ల క్రితం తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిత్యా మీనన్.. ఇప్పుడు ఎక్కువగా తమిళ సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం తన కొత్త సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం కాదలిక్క నేరమిల్లై. ఇందులో జయం రవి హీరోగా నటించాడు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తాజాగా తన కొత్త సినిమాలో కాదలిక్క నేరమిల్లై సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న నిత్యా మీనన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే నిత్యా మాట్లాడుతూ.. తనకు చిత్రపరిశ్రమను వదిలిపెట్టాలని అనుకున్నాను. కానీ నా ఆలోచనను జాతీయ అవార్డ్ మార్చిందని చెప్పుకొచ్చింది. “నాకు సినీరంగం అంటే ఇష్టం లేదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని ఆస్వాదించాలనేది నా కోరిక . ప్రయాణించడమంటే చాలా ఇష్టం. కొంతం నుంచి అవకాశం వస్తే వేరే రంగానికి వెళ్లాలని చూశాను. కానీ నా ఆలోచనలను మార్చేసింది. జాతీయ అవార్డు. ఉత్తమ నటిగా నాకు దక్కిన పురస్కారం నేనెంటో నిరూపించి.. నా జీవితానికి ఓ మార్గాన్ని చూపించింది” అంటూ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో నిత్యా మీనన్ కు సంబంధించిన ఓ వీడియో వైరలవుతుంది. అందులో ఆమె తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో స్టేజ్ పై ఉన్న పీఆర్ఓకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత నటుడు జయం రవికి హగ్ ఇచ్చింది. ఆ తర్వాత దర్శకుడు మిస్కిన్ బుగ్గపై ముద్దు పెట్టింది. దీంతో ఆమె నుంచి ఇలాంటి బిహేవియర్ ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిత్యాకు మద్దతు తెలుపుతున్నారు.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.