Vishal: విశాల్ ఆరోగ్యంపై వదంతులు.. పర్సనల్ మేనేజర్, అభిమాన సంఘాల కీలక ప్రకటన
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై పుకార్లు ఆగడం లేదు. అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినా, ఖుష్బూ, జయం రవి తదితరులు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినా నెట్టింట రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ మేనేజర్ కీలక ప్రకటన విడుదల చేశారు.
విశాల్ ఆరోగ్యంపై లేని పోని వదంతులు సృష్టిస్తే ఊరుకోబోమని అతని అభిమాన సంఘం ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ హెచ్చరించింది. పబ్లిసిటీ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజలు కూడా ఫేక్ న్యూస్ ను తిరస్కరించాలని, పట్టించుకోవద్దని ఆ అభిమాన సంఘం పేర్కొంది. ‘విశాల్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి అధికారికంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. అయినా ఇటీవల కొందరు మా హీరో ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్నారు. మేం ఇలాంటి అసత్య వార్తలను ఖండిస్తున్నాం. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే మా అభిమాన నటుడి ఆరోగ్యంపై ఇలా దుష్ర్పచారం చేయడం తగదు. కొందరు తప్పుడు సమాచారంతో కథనాలు ప్రచారం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం మీడియా ముసుగు వేసుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మవద్దు’ అని విశాల్ అభిమాన సంఘం విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు విశాల్ మేనేజర్ కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘విశాల్ వైరల్ ఫీవర్, తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినా సినిమా ప్రమోషన్స్ కోసం ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఈవెంట్ కు హాజరయ్యాడు. సోషల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఏమాత్రం నమ్మొద్దు’ అన్నారు విశాల్ మేనేజర్
వీరితో పాటు హీరో జయం రవి, ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూలు కూడా విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే అతను పూర్తి ఆరోగ్యంగా తిరిగొస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్ సినిమా మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. సంతానం, సోనూసూద్ కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. కానీ అక్కడ అతని పరిస్థితిని చూసి అందరూ షాక్ అయ్యారు.
విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు..
பாசமிகு அண்ணன் புரட்சி தளபதி விஷால் அவர்கள் விரைவில் நலன் பெறவேண்டி சேலம் மாவட்டம் புரட்சி தளபதி விஷால் மக்கள் நல இயக்கம் சார்பில் திருக்கோவிலில் பூஜை வழிபாடு மற்றும் அன்னதானம் நடைபெற்ற போது@VishalKOfficial @VISHAL_SFC @kalakkalcinema @AIVishal_OFC pic.twitter.com/sjX5Saue3P
— Harikrishnan (@HariKr_official) January 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి