Niharika Konidela: విడాకుల పై తొలిసారి రియాక్ట్ అయిన నిహారిక.. వీడియోపై చైతన్య కామెంట్స్…
చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక... ఇప్పుడు నిర్మాతగా మారి సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అలాగే ఇటు నటిగా తిరిగి రీఎంట్రీ కూడా ఇస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోషూట్స్, ఫ్యామిలీ విషయాలు పంచుకుంటుంది నిహారిక.. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మొదటిసారి తన విడాకుల గురించి మనసు విప్పి మాట్లాడింది. తన జీవితంలో పెళ్లి, విడాకులు, స్నేహితులు, ఫ్యామిలీ, సినిమాలు ఇలా అన్ని అంశాల గురించి మాట్లాడింది.

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల గురించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోయిన్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నటనపరంగా.. కంటెంట్ ఎంపిక పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది నిహారిక. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి జరిగింది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇద్దరం విడిపోయామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా.. అందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. డివోర్స్ ప్రకటన తర్వాత ఎవరికి వారు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక… ఇప్పుడు నిర్మాతగా మారి సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అలాగే ఇటు నటిగా తిరిగి రీఎంట్రీ కూడా ఇస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోషూట్స్, ఫ్యామిలీ విషయాలు పంచుకుంటుంది నిహారిక.. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మొదటిసారి తన విడాకుల గురించి మనసు విప్పి మాట్లాడింది. తన జీవితంలో పెళ్లి, విడాకులు, స్నేహితులు, ఫ్యామిలీ, సినిమాలు ఇలా అన్ని అంశాల గురించి మాట్లాడింది. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని..చాలా ఏడ్చానని చెప్పుకొచ్చింది.
తనది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడం.. కొన్ని విషయాల్లో వర్కౌట్ కాక విడపోవాల్సి వచ్చిందని తెలిపింది. మనుషులను నమ్మకూడదని అర్థమైందని.. పెళ్లితో ఓ పాఠం నేర్చుకున్నానని… కానీ విడాకుల తర్వాత చాలా బాధగా ఉందని.. అందరూ తననే కామెంట్స్ చేశారని.. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, నెగిటివిటీ చూసి చాలా బాధపడ్డానని.. అలాంటి సమయంలో తన ఫ్యామిలీ తనకు సపోర్ట్ గా నిలబడిందని ఎమోషనల్ అయ్యింది నిహారిక. ఆ బాధ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని.. ప్రస్తుతం ఒంటరిగా చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అయితే నిహారిక ఇంటర్వ్యూ వీడియోపై ఆమె మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. కేవలం ఒక సైడ్ మాత్రమే విని జడ్జ్ చేయకూడదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
“నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన ప్రతికూలతను దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నిజంగా అభినందిస్తున్నాను. వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదనే విషయం నాకు తెలుసు. కానీ పరోక్షంగా అందులో ఉన్న బాధితుల గురించి ట్యాగ్ చేయడం.. అందుకు ఇలాంటి ప్లాట్ ఫామ్స్ ఉపయోగించడం కూడా మానేయ్యాలి. ఇలా జరగడం ఇది రెండోసారి. రెండు వైపుల ఆ బాధ, కష్టం ఓకే విధంగా ఉంటుంది. విడాకుల గురించి మాట్లాడుకూడదు.. అందులోనూ ఒక వైపు మాత్రమే అసలు మాట్లాడకూడదు. దానివల్ల బాధపడిన వాళ్ల గురించి జోక్యం చేసుకోకూడదు. అంతకంటే ఆ బాధ గురించి.. దాని నుంచి ఎలా బయటపడింది అనేది మాట్లాడితే ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే నమ్మకం లాంటి వాటి గురించి మాట్లాడాలంటే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించి.. కానీ ఏమి తెలియకుండా ప్రజలు ఒకవైపు జడ్జి చేసి కామెంట్స్ చేయడం పూర్తిగా ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్ ఫామ్స్ ఉపయోగించి ప్రజలకు ఒకవైపు జరిగింది మాత్రమే చెప్పడం కూడా అంతే తప్పు. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం చైతన్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




