Megastar Chiranjeevi: ‘అసలు ఊహించలేదు.. నాలో స్పూర్తి నింపి ముందుకు నడిపింది మీరే’.. రిపబ్లిక్ డే సెలబ్రేషన్లలో చిరంజీవి..
జనవరి 26న చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. ఇక గతరాత్రి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవిని వరించింది.

ఈ ఏడాది రిపబ్లిక్ డే తనకెంతో ప్రత్యేకమని.. ఈ ప్రయాణంలో తనలో స్పూర్తి నింపి ముందుకు నడిపించింది అభిమానులే అన్నారు మెగాస్టార్ చిరంజీవి. జనవరి 26న చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. ఇక గతరాత్రి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరంజీవిని వరించింది. ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులు చిరుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. అటు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్చను అందించారని.. వారి త్యాగఫలమే ఈ స్వేచ్ఛ అని అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ఈ ఏడాది రిపబ్లిక్ డే తనకు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. తన 45 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సినీ కళామతల్లికి సేవ చేసుకున్నానని.. ఎప్పుడూ కళాకారులకు అండగా నిలబడ్డానని.. అందులోనే ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశామని అన్నారు. ఇది ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని… పాతికేళ్ల ముందు రక్తం కొరతతో ప్రాణాలను కోల్పోతున్నారు అనే మాట నుంచి ఇప్పుడు అలాంటి ప్రస్తావన రాలేదంటే నేను తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నానని అన్నారు. బ్లడ్ బ్యాంక్ ఇంతగా సక్సెస్ కావడానికి తన అభిమానులే అని.. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు చిరు. తాను చేసిన సేవలను గుర్తించి 2006లో పద్మ భూషణ్ అవార్డునిచ్చారని..కానీ ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం అసలు ఊహించలేదని అన్నారు. కేంద్రప్రభుత్వం ఈ పురస్కారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని.. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చిరు.
మరోవైపు చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతరాత్రి పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించగానే ఓ వీడియోను రిలీజ్ చేశారు చిరు. 45ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి తన శక్తిమేరకు ప్రయాత్నిస్తూనే ఉన్నానని.. నిజ జీవితంలోనూ తన చుట్టూ ఉన్న సమాజంలో అవసరం అయినప్పుడు సాయం చేస్తూనే ఉన్నానని.. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనని అన్నారు.
Happy 75th Republic Day to All my fellow Indians! May the wonderful ideals of Justice, Liberty, Equality & Fraternity enshrined in our Great Constitution be always accessible to every Indian as envisioned by our forefathers! Jai Hind 🇮🇳 pic.twitter.com/knM20F8C1B
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




