Hanuman Collections: ‘హనుమాన్’ దెబ్బకు హాలీవుడ్ షేక్.. అమెరికాలో కలెక్షన్స్ కుమ్మేస్తోన్న సూపర్ హీరో..
సంక్రాంతి పండక్కి జనవరి 12న విడుదలై..ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు... అమెరికా గడ్డపై కూడా.. ఇదే పేరు మార్మోగిపోతోంది. స్టిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే హాలీవుడ్ కలెక్షన్స్‌ను.. జుర్రేసినంత పని చేస్తోంది. సర్‌ప్రైజింగ్‌లీ.. షాకింగ్‌లీ... అక్కడ కూడా... కలెక్షన్స్ బెంచ్ మార్క్ సెట్ చేసేస్తోంది.

‘హనుమాన్’.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్పూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ సూపర్ హీరో మూవీ ఇప్పుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజా సజ్జా కాంబోలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఇఫ్పుడు సంచలనాలు సృష్టిస్తుంది. సంక్రాంతి పండక్కి జనవరి 12న విడుదలై..ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. కేవలం ఇండియాలోనే కాదు… అమెరికా గడ్డపై కూడా.. ఇదే పేరు మార్మోగిపోతోంది. స్టిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే హాలీవుడ్ కలెక్షన్స్‌ను.. జుర్రేసినంత పని చేస్తోంది. సర్‌ప్రైజింగ్‌లీ.. షాకింగ్‌లీ… అక్కడ కూడా… కలెక్షన్స్ బెంచ్ మార్క్ సెట్ చేసేస్తోంది.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండగ పూట… పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా… సూపర్ డూపర్ హిట్టైపోయింది. ఆల్ ఓవర్ వరల్డ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది. ఇక ఈ క్రమంలోనే అటు అమెరికాలోనూ విధ్వసంకర కలెక్షన్స్ రాబుతోంది ఈ మూవీ. హనుమాన్ సినిమా.. ఓవర్సీస్‌లో.. దాదాపు 4 మిలియన్ డాలర్స్ అందుకుని అక్కడ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడిదే ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీని.. షాకయ్యేలా చేస్తోంది. అప్‌కమింగ్ మేకర్స్‌కు కంటెట్ ఉంటే చాలు.. బొమ్మ ఎక్కడైనా హిట్టనే కాన్ఫిడెంట్‌ను ఇస్తోంది.
ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన శ్రీరామదూత స్తోత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి అంజనాద్రి థీమ్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో హనుమంతుడి జననం నుంచి సూర్యుడిని పండు అనుకోని మింగడం, ఇంద్రుడు హనుమంతుడిపై వజ్రాయుధం సంధించడం లాంటివి చూడవచ్చు. ఇక ఈపాటకు శివశక్తి దత్తా లిరిక్స్ అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి ఆలపించారు. గౌరహరి సంగీతం అందించాడు. ప్రస్తుతం ఆ సాంగ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




