Inaya Sultana: “నాకు నచ్చింది చేస్తా”.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఇనయా సుల్తానా
ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో.. ఎప్పుడు మరణిస్తారో కూడా చెప్పేస్తూ ఉంటారు వేణు స్వామి. అంతే కాదు హీరోయిన్స్ కు ప్రత్యేక పూజలు కూడా చేయిస్తూ ఉంటారు ఈయన. స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోతారు అంటూ ముందే చెప్పారు వేణు స్వామి. ఆయన చెప్పినట్టే ఆ జంట విడిపోయారు. దాంతో వేణుస్వామి పేరు మారుమ్రోగింది.

వేణుస్వామి.. ఈ పెద్దాయన పేరు తెలియని తెలుగువారు ఉండరేమో.. ఈ మధ్యకాలంలో బాగా ఫెమస్ అయ్యారు వేణు స్వామి. సినీ సెలబ్రెటీల జాతకాలు చెప్పడంతో పాటు.. ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో.. ఎప్పుడు మరణిస్తారో కూడా చెప్పేస్తూ ఉంటారు వేణు స్వామి. అంతే కాదు హీరోయిన్స్ కు ప్రత్యేక పూజలు కూడా చేయిస్తూ ఉంటారు ఈయన. స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోతారు అంటూ ముందే చెప్పారు వేణు స్వామి. ఆయన చెప్పినట్టే ఆ జంట విడిపోయారు. దాంతో వేణుస్వామి పేరు మారుమ్రోగింది. స్టార్ హీరోలు చనిపోతారు, అనారోగ్యానికి గురవుతారు అంటూ కూడా కొంతమంది పై కామెంట్స్ చేసి పాపులర్ అయ్యారు.
ఇక రష్మిక, నిధి అగర్వాల్, అషు రెడ్డి లాంటి క్రేజీ బ్యూటీ వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ ఫెమ్ ఇనయా సుల్తానా కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని బోలెడంత క్రేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు సంచలన దర్శకుడు అర్జీవిని ఇంటర్వ్యూ చేసి పాపులారిటీ తెచ్చుకుంది.
ఇక రీసెంట్ గా వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్న ఇనయా సుల్తానాను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మేడలో మాల వేసుకొని వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్న ఇనయా సుల్తానా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పూజ చేయించుకుంటే ఫెమస్డ్ అయిపోతావా..? సినిమా ఆఫర్స్ వచేస్తాయనుకుంటున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నువ్వు ముసల్మాన్ కదా పూజలు చేస్తున్నావేంటీ .? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా దీనిపై ఇనయా స్పందిస్తూ.. “నేను ఇండియాలో ఉన్నాను. ఇక్కడ నాకు నచ్చింది చేయగలిగే ఫ్రీడమ్ ఉంది. మధ్యలో నీకేంటి సమస్య? అంటూ కౌంటర్ ఇచ్చింది ఇనయా సుల్తానా . ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇనాయ సుల్తానా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




