Alia Bhatt: నవ్విన అలియా భట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ఫిక్షనల్ స్టోరీ ఆధారంగా రూపొందించారు. RRRను పాన్ ఇండియా మూవీగా తీశారు. ఈ చిత్రం ఈనెల 7న విడుదల కావాల్సింది. కానీ దేశ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులతో చిత్ర విడుదలను వాయిదా వేశారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన అలియా భట్ తెలుగు తెరకు తొలిసారి పరిచయం అవుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడడంపై నెటిజన్స్ అలియాభట్ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అలియాభట్ నీ నవ్వు ఫేక్ అంటూ ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు.
ఇటీవల అలియా భట్ ఓ ఈవెంట్లో మీడియా ఫొటోగ్రాఫర్లు కోరిక మేరకు ఫొటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని ఫొటోగ్రాఫర్ భయాని తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె నవ్వుతూ కనిపించారు. ఇది చూసిన నెటిజన్లు ఆమెది ఫేక్ నవ్వు అని ట్రోల్ చేస్తున్నారు.