
భారతీయ సినీరంగంలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎంతో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆమె సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. కొన్నాళ్లుగా ఈ అమ్మడు జోరు తగ్గింది. కానీ రెమ్యునరేషన్ మాత్రం తగ్గేదేలే అంటోదట. దాదాపు ఆమె నటించిన పది సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయినప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం ఎక్కువే డిమాండ్ చేస్తుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల పారితోషికం తీసుకోవాలనుకుంటుందట ఈ అమ్మడు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నయనతార. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకుంది.
ఇప్పుడు నయన్ వయసు 40 సంవత్సరాలు. అయినప్పటికీ కుర్రహీరోయిన్లకు గట్టిపోటీనిస్తుంది. దశాబ్దాలుగా సినీరంగంలో కొనసాగుతున్న నయన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్. ఇరవై ఏళ్లకు పైగా తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నయనతార.. అటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటుతుంది. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. దీంతో ఆమె క్రేజ్ పాన్ ఇండియాకు చేరింది.
ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తుందని.. ఇదివరకు ఏ హీరోయిన్ సైతం ఇంతగా పారితోషికం తీసుకోలేదని టాక్. కానీ కొన్నాళ్లుగా తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా ఉంటుంది నయన్. కానీ ఆమె నటించిన పది సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..