AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Box Office: వరుసగా 4 హిట్లు.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి టాలీవుడ్ హీరో! నిర్మాతలకు భరోసానిస్తున్న సినిమాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సక్సెస్ అనేది ఒక మిస్టరీలా మారిపోయింది. వందల కోట్ల బడ్జెట్ పెట్టినా, అగ్ర హీరోలు నటించినా బాక్సాఫీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కానీ ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ఒక యువ హీరో సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

Box Office: వరుసగా 4 హిట్లు.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి టాలీవుడ్ హీరో! నిర్మాతలకు భరోసానిస్తున్న సినిమాలు
Star Entertainer
Nikhil
|

Updated on: Jan 21, 2026 | 6:00 AM

Share

ఆ హీరో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయాల్సిందే, కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. తనదైన టైమింగ్‌తో, వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేటును సొంతం చేసుకున్న ఆ హీరో, తాజాగా ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి అగ్ర హీరోల సరసన నిలిచాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు?

వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆ హీరో ఎవరో కాదు.. నవీన్​ పొలిశెట్టి. ఈ యంగ్​ హీరో తన సినీ ప్రస్థానంలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన మొదటి నాలుగు థియేట్రికల్ సినిమాలు కూడా ఘనవిజయాలు సాధించడం విశేషం.

Naveen Polishetty

Naveen Polishetty

* ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: ఒక డిటెక్టివ్ థ్రిల్లర్‌తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. * జాతిరత్నాలు: బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. * మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: అనుష్క సరసన నటించిన ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించారు. * అనగనగా ఒక రాజు: తాజాగా ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్కును దాటి నవీన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

వంద కోట్ల క్లబ్‌లో..

‘అనగనగా ఒక రాజు’ సినిమా నవీన్ పొలిశెట్టి రేంజ్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, నవీన్ కెరీర్‌లో మొదటి 100 కోట్ల మైలురాయిని అందించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో, అది కూడా అమెరికాలో నవీన్ సినిమాలకు ఉండే డిమాండ్ ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. దీంతో నవీన్ ఇప్పుడు టాలీవుడ్ లీగ్ ఆఫ్ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు.

Aor

Aor

ప్రొడ్యూసర్ల నమ్మకం..

నవీన్ సాధించిన ఈ విజయంలో ఒక గొప్ప విశేషం ఉంది. ఆయన విభిన్న నిర్మాణ సంస్థలలో, విభిన్న జానర్లలో సినిమాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం ఒకేలా రావడం. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో నవీన్ ఒక నమ్మకమైన పేరుగా మారారు. ప్రస్తుతం సినిమా ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో, నవీన్ సినిమా అంటే రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

కథల ఎంపికలో ఆయన చూపిస్తున్న విజ్ఞత, ప్రమోషన్లలో ఆయన చూపే ఉత్సాహం నవీన్‌ను అందరి కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. నవీన్ పొలిశెట్టి సాధిస్తున్న ఈ విజయాలు చూస్తుంటే, టాలీవుడ్‌లో ఒక కొత్త తరహా స్టార్‌డమ్ మొదలైందని అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, బలమైన కంటెంట్, కామెడీ ఉంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని ఆయన నిరూపించారు. భవిష్యత్తులో నవీన్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.