Tollywood: మనసిచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ సింగర్.. ఫొటోస్ వైరల్.. వధువు ఎవరో తెలుసా?
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ కు మొత్తం ఏడు అవార్డులు వచ్చాయి. అందులో ఈ టాలీవుడ్ సింగర్ కూడా ఉన్నాడు. ఈ ఆనందంలో మునిగి తేలుతుండగానే ఇప్పుడు మరో శుభవార్త చెప్పాడీ నేషనల్ అవార్డ్ విన్నర్.

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తా చాటింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ సినీ అవార్డుల్లో టాలీవుడ్ మొత్తం ఏడు పురస్కారాలను గెల్చుకుంది. అందులో టాలీవుడ్ సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ కూడా ఉన్నాడు. బ్లాక్ బస్టర్ బేబీ సినిమాలో ‘ప్రేమిస్తున్నా’ పాటకు గానూ బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డుకు రోహిత్ ఎంపికయ్యాడు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సింగర్ పేరు మార్మోగిపోయింది. ఇలాంటి సంతోషకర సమయంలో రోహిత్ మరో శుభవార్త చెప్పాడు. తను ప్రేమించిన అమ్మాయితో త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు ప్రకటించాడు. తాజాగా డాక్టర్ శ్రేయ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు రోహిత్. అనంతరం ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించాడు. ‘నా లక్కీ గర్ల్‌ను నిశ్చితార్థం చేసుకున్నాను’ అంటూ శ్రేయతో కలిసి దిగిన ఓ అందమైన ఫోటోను పంచుకున్నాడు రోహిత్. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, సంగీత ప్రియులు, నెటిజన్లు రోహిత్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నీ గొంతులాగే.. నీ లవ్ స్టోరీ కూడా హార్ట్ టచింగ్..
రోహిత్ ఎంగేజ్ మెంట్ పై పలువురు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు స్పందిస్తున్నారు. ‘డబుల్ కంగ్రాట్స్! లైఫ్‌లో కొత్త ఛాప్టర్‌కు ఆల్ ద బెస్ట్ అంటూ’ కాబోయే దంపతులకు విషెస్ చెప్పాడు థమన్. ‘ నీ గొంతు ఎంత హార్ట్‌టచింగ్‌గా ఉంటుందో, నీ లవ్ స్టోరీ కూడా అంతే అందంగా ఉండాలి’ అని సిద్ శ్రీరామ్ కామెంట్ పెట్టాడు. ‘ బేబీ సినిమా ప్రేమ పాట రియల్ లైఫ్ ప్రేమకథగా మారినందుకు ఆనందంగా ఉంది’ అని డైరెక్టర్ అనుదీప్ రాసుకొచ్చాడు. అలాగే మరో ఫేమస్ సింగర్ గీతా మాధురి కూడా రోహిత్‌కి శుభాకాంక్షలు తెలియజేసింది.
కాబోయే భార్యతో సింగర్ రోహిత్..
View this post on Instagram
ఇక రోహిత్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, కమిటీ కుర్రోళ్లు, కొండపొలం, సరిపోదా శనివారం, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్, జయమ్మ పంచాయతీ, ప్రేమ కథ చిత్రం 2, ప్రియురాల, కౌసల్య తనయ రాఘవ తదితర సినిమాల్లో పాటలు ఆలపించాడు. అయితే బేబీ సినిమాలోని ప్రేమిస్తున్నా సాంగ్ రోహిత్ కు ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది.
హీరో విజయ్ దేవరకొండతో కలిసి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








