AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ మూవీ.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం

మీకు క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ సినిమాలంటే ఇష్టమా? అయితే మీకోసమే ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఐఎమ్ డీబీ టాప్ రేటింగ్ పొంది ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది.

OTT Movie: మస్ట్ వాచ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో ఐఎమ్‌డీబీలో టాప్ రేటింగ్ మూవీ.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ ఖాయం
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 06, 2025 | 9:06 PM

Share

గత వారం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అయితే ఇందులో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను బాగా అలరిస్తోంది. క్రైమ్, సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా చాలా అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ హత్యల చుట్టూ తిరిగే ఈ సినిమ ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా నడుస్తుంది. అందుకే జూన్ 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఐఎమ్ డీబీలో 7.8/10 రేటింగ్‌తో ఆడియెన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడీ సినిమా ఆగస్టు 01 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. ఇక్కడ కూడా రికార్డు వ్యూస్ తో దూసుకెళ్లిపోతోంది. ఈ సినిమా కథేంటంటే.. రంగరాజ్ నిజాయతీగల పోలీస్ ఆఫీసర్ అవుతాడు. విధి నిర్వహణలో ఎవరి మాటకు తలొగ్గడు. శ్రుతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. అయితే ఒక రోజు రంగరాజ్ భార్య, గర్భంతో ఉండగా ఎవరో దారుణంగా కత్తితో పొడిచి చంపుతారు. అంతకు ముందే రంగ రాజ్ తల్లిదండ్రులు కూడా హత్యకు గురయ్యారని తెలుస్తుంది.

తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన వాళ్లను పట్టుకోవాలని రంగరాజ్ కంకణం కట్టుకుంటాడు. ఈ హత్యల వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని ఒక డిటెక్టివ్‌లా దర్యాప్తు మొదలెడతాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. తన కుటుంబ సభ్యుల హత్యల వెనక ఓ పెద్ద కుట్ర ఉందని రంగ రాజ్ కు అర్థమవుతుంది. మరి రంగరాజ్ కుటుంబ సభ్యులను చంపిందెవరు? ఎందుకు పోలీస్ ఫ్యామిలీని టార్గెట్ చేసి చంపారు? చివరకు ఆ కిల్లర్స్ ఎవరో దొరికారా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు గట్స్. ఆగస్టు 1 నుంచి టెంట్‌కొట్ట ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ లేకున్నా ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి గట్స్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..