MAD 2: దుమ్ములేపుతున్న మ్యాడ్ స్క్వేర్.. ఓవర్సీస్‌లో దూసుకుపోతున్న సినిమా..
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమా మ్యాడ్. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. అలాగే ఓవర్సీస్‌లోను మ్యాడ్ స్క్వేర్ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చ్ 28న పేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి చేరుకున్నాయి. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు.
‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇక ‘లడ్డు గానీ పెళ్లి, ‘స్వాతి రెడ్డి’, ‘వచ్చార్రోయ్’ పాటలు చార్ట్‌బస్టర్ లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ అద్భుత కెమెరా పనితనం, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. వెండితెరపై భారీ వినోదాన్ని అందిస్తుంది మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించాడు. ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించిన అల్లరి చేసి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు మంచి వసూళ్లు సొంతం చేసుకుంటుంది. ఉగాది రోజున కూడా మంచి వసూళ్లు సొంతం చేసుకుందని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ఓవర్సీస్‌లోనూ మ్యాడ్ స్క్వేర్ సినిమా సత్తా చాటుతుంది. అక్కడ వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసేసింది ఈ సినిమా. మ్యాడ్ స్క్వేర్ మూడు రోజుల్లో 55 నుంచి 60 కోట్ల వరకు రాబట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచుతుంది మ్యాడ్ స్క్వేర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.