Mohanlal: మోహన్ లాల్ సినిమాపై సైబర్ దాడి.. ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసీఫర్. ఐదేళ్ళ కింద విడుదలైన ఈ చిత్రం మలయాళంలో మొదటి సారిగా 150 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చిందిప్పుడు. మరి ఎంపురాన్ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటికే రూ.100కోట్ల క్లబ్ లోకి చేరిందని తెలుస్తుంది.

మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం 2019లో విడుదలైన లూసిఫెర్ కు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఎంపురాన్ విడుదలైన తర్వాత, సినిమా ఇతివృత్తంపై పలు వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించేలా ఉందని, అబద్ధాలను వ్యాప్తి చేస్తుందని సంఘ్ పరివార్ ఆరోపించింది. ఈ విషయంపై మోహన్ లాల్ కూడా ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు. చాలా మంది మోహన్ లాల్ పై విమర్శలు చేయడం, ట్రోల్స్ చేయడం చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది సుభాష్ తీక్కడాన్ సినిమా హీరో మోహన్ లాల్, ఇతరులపై సైబర్ దాడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
వివాదం తర్వాత ఈ చిత్రాన్ని తిరిగి సవరించనున్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ అల్లర్ల దృశ్యాలు,కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని జాతీయ ఏజెన్సీ కేసులో ఇరికించినట్లు చూపించే సన్నివేశాలలో కొన్ని మార్పులు చేస్తున్నారు. విలన్ బాబా బజరంగీ పేరును మార్చాలని సూచించారు. తిరిగి సవరించిన వెర్షన్ గురువారం నుంచి థియేటర్లలోకి వస్తుంది.
వివాదాలు ఉన్నప్పటికీ ఎంపురాన్ దూసుకుపోతుంది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది ఈ సినిమా. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే మురళీ గోపి రాశారు. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు, పృథ్వీరాజ్, మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జెరోమ్ ఫ్లిన్, బైజు, సాయికుమార్, ఆండ్రియా తివాడర్, అభిమన్యు సింగ్, సానియా అయ్యప్పన్, ఫాజిల్, సచిన్ ఖడ్కర్, నైలా ఉష, జిజు జాన్, నందు, మురుగన్ మార్టిన్, శివాజీ గురువాయూర్, మణికుట్టన్, అనిష్ జి మీనన్, శివదా, అలెక్స్ ఓ’నీల్, ఎరిక్ ఎబోనీ, కార్తికేయ దేవ్, మిహాయెల్ నోవికోవ్, కిషోర్, సుకాంత్, బెహజాద్ ఖాన్, నిఖత్ ఖాన్, సత్యజిత్ శర్మ, నయన్ భట్, శుభంగి , జైస్ జోస్ ఇలా చాలా మంది ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.