Jayam: జయం సినిమాలో హీరోయిన్‌గా ఆమె చేయాలట.. కానీ లాస్ట్‌లో ఊహించని ట్వీట్..
తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరయ్యాయి. తేజ ఎన్నో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో జయం సినిమా ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంత సులభంగా మరిచిపోలేరు.

టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్‌కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఇందులో నితిన్ సరసన సదా కథానాయికగా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు నటీనటులుగా పరిచయంకాగా.. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. జయం చిత్రంలో నితిన్, సదా, గోపిచంద్ ముగ్గురి నటనపై ప్రశంసలు వచ్చాయి.
అయితే ఈ సినిమాలో సద కంటే ముందు మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? మీరు ఊహించలేరు కూడా.. ఆమె ఎవరో కాదు అందాల యాంకరమ్మ రష్మీ గౌతమ్. నితిన్ రీసెంట్ గా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఆ షోకు రష్మీ యాంకర్ గా చేసింది. ఈ షోలో నితిన్ ఆసక్తికర తన మొదటి సినిమా జయం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
జయం సినిమాకు రష్మీతో కలిసి రిహార్సిల్స్ చేశారట నితిన్. జయం సినిమా కోసం దాదాపు 90 శాతం రష్మీతోనే రిహార్సిల్స్ చేశారట నితిన్. కానీ ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ ను మార్చేసింది. దాంతో రష్మీ ప్లేస్ లోకి సద వచ్చిందట. ఈ సినిమా రష్మీ ఖాతాలో పడి ఉంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళేది అని నెటిజన్స్, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ యాంకర్ గా ఎన్నో టీవీషోలు చేసింది. అలాగే హీరోయిన్ గాను పలు సినిమాల్లో నటించింది. అలాగే సహాయక పాత్రలు కూడా చేసింది .
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.