Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishnavi Chaitanya: స్పీడ్ పెంచిన తెలుగమ్మాయి.. రెమ్యునరేషన్ పెంచేసిన వైష్ణవి చైతన్య

వైష్ణవి చైతన్య షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది.

Vaishnavi Chaitanya: స్పీడ్ పెంచిన తెలుగమ్మాయి.. రెమ్యునరేషన్ పెంచేసిన వైష్ణవి చైతన్య
Vaishnavi Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2025 | 11:45 AM

వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలుగమ్మాయి ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి కలిగిన వైష్ణవి, తన కెరీర్‌ను వెబ్ సిరీస్‌లు మరియు చిన్న పాత్రలతో ప్రారంభించింది. 2020లో వచ్చిన “ది సాఫ్ట్‌వేర్ డెవలపర్” అనే వెబ్ సిరీస్‌లో నటించి గుర్తింపు పొందింది. అదే సంవత్సరం, అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురములో” సినిమాలో అతని సోదరి పాత్రలో కనిపించి తెలుగు సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది.

2023లో విడుదలైన “బేబీ” సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్‌డమ్ సాధించింది. హీరోయిన్ గా తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. “బేబీ” సినిమాకు గాను ఆమె ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్, SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ గెలుచుకుంది. వైష్ణవి తన సహజమైన నటన, అందమైన లుక్స్‌తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

“బేబీ” తర్వాత ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చాయి, అందులో “లవ్ మీ – ఇఫ్ యు డేర్” ఒకటి. ఈ సినిమాలో ఆమె ఆశిష్‌తో కలిసి నటించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. సినిమాకు వైష్ణవి 50 లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను రూ. 1 కోటికి పెంచిందని టాక్ వినిపిస్తుంది. జాక్ సినిమాతో పాటు ఆనంద్ దేవరకొండతో కలిసి వైష్ణవి ఓ సినిమాలో చేస్తోంది. 90s వెబ్ సిరీస్‌కు అది సీక్వెల్‌గా రావుతుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.