
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో ఓ ఇంటివాడు అయ్యాడు. హీరోయిన్ శిరీషతో కలిసి ఓ కొత్త జీవితం ప్రారంభించాడు రోహిత్. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది సిరి లేళ్ల. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. పెద్దల అనుమతితో గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కొత్తజంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నారా రోహిత్ పెదనాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.
ఈవివాహవేడుకలో చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ సహా పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు రోహిత్. ఈ ఏడాది భైరవం, సుందరకాండ చిత్రాలతో హిట్లు అందుకున్నాడు. రోహిత్ కు అభినందనలు తెలుపుతూ.. చంద్రబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నారు.
“మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్లికి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు” అంటూ చంద్రబాబు రాసుకొచ్చారు. అలాగే కొన్ని ఫోటోలు పంచుకున్నారు.
మా ఇంటి పెళ్లి సందడి.. నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనయుడు నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకను అంగరంగ వైభవంగా చేశాం. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశాం. మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న శుభ సందర్భం మా కుటుంబానికి ఒక పండుగ. మా నారావారి… pic.twitter.com/Tq3nVXtsmO
— N Chandrababu Naidu (@ncbn) October 30, 2025
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి