King of Kotha : దుల్కర్ సల్మానే పాన్ ఇండియా హీరో.. కారణం చెప్పిన నాని

దుల్కర్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమాలో దుల్కర్ కీలక పాత్రలో కనిపించాడు . లెజెండ్రీ నటుడు జెమిని గణేశన్ పాత్రలో నటించాడు దుల్కర్. ఈ సినిమాలో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది.

King of Kotha : దుల్కర్ సల్మానే పాన్ ఇండియా హీరో.. కారణం చెప్పిన నాని
King Of Kotha
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2023 | 7:45 AM

దుల్కర్ సల్మాన్.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. నిత్యామీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దుల్కర్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత దుల్కర్ నటించిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమాలో దుల్కర్ కీలక పాత్రలో కనిపించాడు . లెజెండ్రీ నటుడు జెమిని గణేశన్ పాత్రలో నటించాడు దుల్కర్. ఈ సినిమాలో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.  రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతారామం సినిమా చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాంగ్ ఆఫ్ కోత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమాలో దుల్కర్ కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుంది. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు నేచురల్ స్టార్ నాని, రానా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా స్టార్ అని కితాబిచ్చారు.

నాని మాట్లాడుతూ.. దుల్కర్‌ ‘ఓకే బంగారం’ సినిమాలో నా వాయిస్ ఉంటుంది. అతని జర్నీలో నా భాగస్వామ్యం కూడా ఉందని నేను ఫీల్ అవుతున్నా అన్నారు. అలాగే మనం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు..పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం కానీ నాకు ఆ పదం నచ్చదు. నాకు తెలిసి పాన్ ఇండియా స్టార్ అంటే దుల్కర్ సల్మానే. ఎందుకంటే ఓ తమిళ్ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాస్తాడు, ఓ తెలుగు దర్శకుడు కథ రాస్తాడు, హిందీ , మలయాళం ఇలా అన్ని బాషల దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. అందుకే దుల్కర్ పాన్ ఇండియా హీరో అన్నారు. అలాగే రానా మాట్లాడుతూ.. దుల్కర్ నుంచి యాక్షన్ సినిమా వస్తుందంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని అన్నారు.

దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల కానుంది.

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

నాని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.