Double iSmart: జెట్ స్పీడ్‌లో డబుల్ ఇస్మార్ట్ షూటింగ్.. థాయిలాండ్‌లో మూవీ టీమ్
ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కు భారీ హిట్ ను అందించింది. ఈ సినిమాలో రామ్ నటన, పూరిజగన్నాథ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రామ్ తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. అలాగే ఈమూవీలో నిధి అగర్వాల్, నభా నటేష్ తమ అందాలతో కవ్వించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు పూరి. రీసెంట్ గా ఈ మూవీ పూజ కార్యక్రమాలతో మొదలైంది. షూటింగ్ కూడా శరవేగంగా జరిగుతోంది.
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఆయన నుంచి ఓ సాలిడ్ హిట్ కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. పోకిరి బిజినెస్ మ్యాన్ లాంటి సూపర్ హట్స్ తర్వాత పూరిజగన్నాథ్ టెంపర్ తో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత యంగ్ హీరో రామ్ పోతినేనితో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశాడు పూరి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ కూడా చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కు భారీ హిట్ ను అందించింది. ఈ సినిమాలో రామ్ నటన, పూరిజగన్నాథ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రామ్ తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు. అలాగే ఈమూవీలో నిధి అగర్వాల్, నభా నటేష్ తమ అందాలతో కవ్వించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు పూరి. రీసెంట్ గా ఈ మూవీ పూజ కార్యక్రమాలతో మొదలైంది. షూటింగ్ కూడా శరవేగంగా జరిగుతోంది.
పూరిజగన్నాథ్ చివరిగా లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలన్న కసిమీదున్నాడు పూరిజగన్నాథ్. రామ్ తో మరోసారి తెలంగాణ యాసలో డైలాగ్స్ పలికింది పూరి ఈస్ బ్యాక్ అనిపించుకోవాలని చూస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ థాయిలాండ్ లో జరుగుతోంది. ప్రస్తుతం రామ్ పై సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన పూరి ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ ఎవరు అనే దాని పై క్లారిటీ రావాల్సి ఉంది.
రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాతో హిట్ కొడతారంటున్నారు ఫ్యాన్స్..
View this post on Instagram
డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..
View this post on Instagram
డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.