Surya: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన సూర్య.. ఆ సినిమా పై క్లారిటీ ఇచ్చేశాడుగా..
విక్రమ్ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, తమిళ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించారు. అలాగే ఈ మూవీ చివరిలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు హీరో సూర్య. రోలెక్స్ పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. కార్తీ ఖైదీ సినిమాకు విక్రమ్ సినిమాకు లింక్ పెట్టాడు దర్శకుడు లోకేష్ కానగరాజ్. అలాగే సూర్యను మెయిన్ విలన్ గా చూపించారు లోకేష్. రోలెక్స్ పాత్రలో సూర్య నటన . ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ నటన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక విక్రమ్ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, తమిళ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించారు. అలాగే ఈ మూవీ చివరిలో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు హీరో సూర్య. రోలెక్స్ పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. కార్తీ ఖైదీ సినిమాకు విక్రమ్ సినిమాకు లింక్ పెట్టాడు దర్శకుడు లోకేష్ కానగరాజ్. అలాగే సూర్యను మెయిన్ విలన్ గా చూపించారు లోకేష్. రోలెక్స్ పాత్రలో సూర్య నటన . ఆయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.
దాంతో రోలెక్స్ పాత్రతో సినిమా ఉంటుందని అప్పటి నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగ రాజ్ ఇప్పుడు దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నారు. లియో అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు విక్రమ్ సినిమాకు లింక్ ఉంటుందని అంటున్నారు అభిమానులు.
ఇప్పటికే విడుదలైన లియో మూవీ పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే సూర్య సినిమా ఉంటుందని తెలుస్తోంది. లియో తర్వాత విక్రమ్ మూవీలోని సూర్య పాత్రతో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు సూర్య. ఇందులో భాగంగా తాను చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి తెలిపారు. సూర్య మాట్లాడుతూ.. ప్రజెంట్ కంగువ అనే సినిమా చేస్తున్నా.. ఈ సినిమా చాలా బాగా వస్తుంది. ఆతర్వాత వెట్రిమారన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే లోకేష్ కానగరాజ్ రోలెక్స్ కథ కూడా చెప్పారు చాలాబాగుంది కథ ఆ సినిమా కూడా త్వరలో ఉంటుంది అని తెలిపారు సూర్య. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
View this post on Instagram
లోకేష్ కానగరాజ్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు సూపర్ హిట్ టాక్స్ తో దూసుకుపోతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.