‘మంచోడు’ అంటున్నారు.. నువ్వేంట్ర ఇరగొట్టేస్తున్నావ్..!

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. దసరా పండుగ సందర్భంగా.. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగుతూ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించగా.. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ సరసన మెహరిన్ నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు. టీజర్ ఎలాఉందంటే..? ఒక్కోక్కరు ఒక్కో పేరుతో పిలుస్తూ.. మావోడు మంచోడు అనిచెబుతూంటారు. ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:48 am, Wed, 9 October 19
'మంచోడు' అంటున్నారు.. నువ్వేంట్ర ఇరగొట్టేస్తున్నావ్..!

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. దసరా పండుగ సందర్భంగా.. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగుతూ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాకి వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించగా.. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్‌ సరసన మెహరిన్ నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నారు.

టీజర్ ఎలాఉందంటే..? ఒక్కోక్కరు ఒక్కో పేరుతో పిలుస్తూ.. మావోడు మంచోడు అనిచెబుతూంటారు. ఈ క్రమంలో ‘అందరూ మంచోడు.. మంచోడు అంటున్నారు.. మరి నువ్వేంట్రా ఇలా కొడుతున్నావ్’ అని విలన్ అడగ్గా.. ‘రాముడు కూడా మంచోడే.. కానీ రావణుడిని వేసేయలేదా..?’ అంటూ.. కల్యాణ్ రామ్.. ఫుల్ పవర్‌ డైలాగ్ ఆకట్టుకుంటోంది. మరి మళ్లీ ఊరికి ఎప్పుడు వస్తున్నావ్‌రా అని అడుగగా.. సంక్రాంతి నాన్న అని చెప్పడం వెనుక.. ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు అర్థమవుతున్నది. పల్లెటూరి.. నేపథ్యంలో.. కుటుంబసమేతంగా.. ఈ చిత్రం రూపొందుతోంది.