Srikanth Addala : మరో సినిమాను లైన్ లో పెట్టిన నటసింహం.. నారప్ప దర్శకుడితో బాలయ్య సినిమా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క‌రోనా కార‌ణంగా మూగ‌బోయిన థియేట‌ర్ల‌లో సింహ గ‌ర్జ‌న చేస్తూ దూసుకొచ్చింది

Srikanth Addala : మరో సినిమాను లైన్ లో పెట్టిన నటసింహం.. నారప్ప దర్శకుడితో బాలయ్య సినిమా..?
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 01, 2022 | 11:00 PM

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క‌రోనా కార‌ణంగా మూగ‌బోయిన థియేట‌ర్ల‌లో సింహ గ‌ర్జ‌న చేస్తూ దూసుకొచ్చింది బాల‌కృష్ణ అఖండ సినిమా. బాల‌య్య బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా వ‌సూళ్ల సునామీని సృష్టించింది. ఏకంగా రూ. 200 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సంచ‌న‌ల విజ‌యం సాధించింది. ఇటీవ‌లి కాలంలో థియేట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా అఖండ అరుదైన గుర్తింపును ద‌క్కించుకుంది. బోయ‌పాటి మార్క్ డైరెక్ష‌న్‌కు డివోష‌న్ ట‌చ్ తోడ‌వ‌డంతో ఈ సినిమా అటు మాస్ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఫ్యామిటీ ఆడియ‌న్స్‌ను సైతం ఆక‌ట్టుకుంది.ఇక తెలుగులో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న ఈ సినిమాపై బాలీవుడ్ దృష్టి ప‌డింది. సోష‌ల్ మీడియాలో అఖండ సృష్టించిన సునామీ, దీనికి తోడు ఓటీటీలోనూ అఖండ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతుండ‌డంతో బాలీవుడ్ మేక‌ర్స్ అఖండ‌ను రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు.

ఇదిలా ఉంటే అఖండ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపీచంద్ మైనేని డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్  ఇటీవలే పూజ కార్యక్రమాలతో మొదలయింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే.. బాలకృష్ణను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలిసి ఒక కథ చెప్పాడనీ, ఆ కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు, దిల్ రాజు నిర్మించిన కొత్తబంగారు లోకం సినిమాతోనే శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. రీసెంట్ గా వెంకటేష్ నటించిన నారప్ప సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే  బాలయ్య ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలపైకి వెళుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

TOP 9 ET News: క్రీడాకారుడిగా ఎన్టీఆర్‌ | RRR అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎప్పటినుండి అంటే..(వీడియో)

Nithya Menon: బూరె బుగ్గల బాబ్లీ బ్యూటీ నిత్యామీనన్.. నయా ఫొటోస్ అదుర్స్..

Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి