AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna : స్పీడ్ పెంచిన నటసింహం.. మహేష్ బాబు దర్శకుడితో బాలయ్య సినిమా.?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి

Nandamuri Balakrishna : స్పీడ్ పెంచిన నటసింహం.. మహేష్ బాబు దర్శకుడితో బాలయ్య సినిమా.?
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2022 | 3:53 AM

Share

Nandamuri Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాలిసిన అవసరం లేదు. సింహ, లెజెండ్ సినిమాలతర్వాత వచ్చిన అఖండ ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో బాలయ్య 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. కరోనా తర్వాత భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా అఖండ నిలిచిపోయింది. ఇప్పుడు మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఇటీవలే “క్రాక్” సినిమాతో టాలీవుడ్ కు అద్భుతమైన హిట్‌ని అందుకున్నాడు గోపిచంద్ మలినేని. వీరిద్ధరి కాంబోలో రాబోతున్న ఈచిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని #NBK107 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రారంభించారు.

ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాను లైనప్ చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వం ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్యతో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అనిల్ కు అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. ఈ సినిమాతో పాటే మరో సినిమా కూడా బాలయ్య చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో సినిమా తరువాత కొరటాల చేసే ప్రాజెక్టు కూడా బాలకృష్ణతోనే అనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు దిల్ రాజు నిర్మాతగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయడానికి అంగీకరించారనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అలాగే పూరిజగన్నాథ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నారట బాలయ్య. వీటితోపాటు పరశురామ్ దర్శకత్వంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. పరశురామ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారిపాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతర్వాత నాగచైతన్యతో సినిమా ఉంటుంది. ఆతర్వాత బాలయ్య తో పరశురామ్ సినిమా చేయుయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijaya Shanthi: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

Childhood Rare Pic: ఆడపిల్ల వేషంలో దక్షిణాది సీనియర్ నటుడు.. తెలుగువారికి సుపరిచితులు ఎవరో గుర్తు పట్టారా. ..

Priyamani: గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్ షురూ చేసిన ‘ప్రియమణి’.. చీరలో ఆకట్టుకుంటున్న ఫొటోస్…