గత్తర లేపుతోన్న బాలయ్య లుక్..మీసం మెలేశాడుగా..

పాత్ర డిమాండ్ చేస్తే..ఎటువంటి ఆహార్యంలో అయినా కనిపించడానికి వెనకాడరు నట సింహ నందమూరి బాలకృష్ణ. ‘భైరవద్వీపం’, ‘అధినాయకుడు’, ‘పరమవీరచక్ర’ లాంటి సినిమాలే అందుకు ఉదాహారణలు. ఒకసారి సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్ ఏది చెబితే అదే బాలయ్యకు శిరోధార్యం. అలా చేసినందుకే కొన్ని సినిమాల్లో ఇబ్బందికర సీన్లలో కూడా ఆయన నటించాల్సి వచ్చింది. ఎంత డ్యామేజ్ జరిగిన ఆయన మాత్రం రూట్ మార్చరు. ఇటీవల ‘రూలర్‌’ మూవీలో ఐరన్‌ మ్యాన్‌ లుక్‌లో మెస్మరైజ్ చేశారు బాలయ్య. ఇక బోయపాటి-బాలయ్య […]

గత్తర లేపుతోన్న బాలయ్య లుక్..మీసం మెలేశాడుగా..
Ram Naramaneni

|

Mar 21, 2020 | 6:08 PM

పాత్ర డిమాండ్ చేస్తే..ఎటువంటి ఆహార్యంలో అయినా కనిపించడానికి వెనకాడరు నట సింహ నందమూరి బాలకృష్ణ. ‘భైరవద్వీపం’, ‘అధినాయకుడు’, ‘పరమవీరచక్ర’ లాంటి సినిమాలే అందుకు ఉదాహారణలు. ఒకసారి సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్ ఏది చెబితే అదే బాలయ్యకు శిరోధార్యం. అలా చేసినందుకే కొన్ని సినిమాల్లో ఇబ్బందికర సీన్లలో కూడా ఆయన నటించాల్సి వచ్చింది. ఎంత డ్యామేజ్ జరిగిన ఆయన మాత్రం రూట్ మార్చరు. ఇటీవల ‘రూలర్‌’ మూవీలో ఐరన్‌ మ్యాన్‌ లుక్‌లో మెస్మరైజ్ చేశారు బాలయ్య.

ఇక బోయపాటి-బాలయ్య కాంబోలో త్వరలో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మూవీ తొలి షెడ్యూల్ వారణాసిలో ప్రారంభమైనప్పటికి, కరోనా ప్రభావంతో నిలిపివేశారు.  ఈ చిత్రంలో బాలయ్య ఒక పాత్ర కోసం అఘోర గెటప్‌లో కనిపించనున్నారని టాక్. అందుకోసం ఆయన ప్రస్తుతం లుక్‌పై దృష్టి పెట్టారు. షార్ట్‌గా కట్ చేసిన జట్టు, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక నందమూరి అభిమానులను సోదర సమానులుగా భావించే బోయపాటి..తన అభిమాన హీరో బాలయ్యను ఎలా చూపిస్తారో సెపరేట్‌గా చెప్పాలా..?. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’, లెజెండ్ సినిమాలు రచ్చ లేపాయి. తాజాగా హ్యాట్రిక్‌తో ఇండస్ట్రీపై అదిరిపోయే ఇంపాక్ట్ ఇవ్వాలని భావిస్తోంది ఈ జోడి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu