AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: పసిప్రాణానానికి అండగా బాలయ్య అభిమానులు.. క్యాన్సర్‌తో బాధపడుతోన్న చిన్నారికి ఆర్ధిక సాయం

బసవతారకం హాస్పటల్ ద్వారా ఎంతో మంది పేదలకు వైద్య సాయం అందించారు. అంతే కాదు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గం ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారు బాలయ్య. ఇక బాలయ్య అభిమానులు కూడా ఆయనలానే సేవాగుణం లో ముందుంటారు. బాలకృష్ణ పుట్టిన రోజు, లేదన్నా ఏదైనా ప్రత్యేకమైన రోజున అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేస్తుంటారు.

Balakrishna: పసిప్రాణానానికి అండగా బాలయ్య అభిమానులు.. క్యాన్సర్‌తో బాధపడుతోన్న చిన్నారికి ఆర్ధిక సాయం
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Sep 30, 2024 | 8:27 AM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎంత పెద్ద హీరోనో.. అంతకంటే గొప్ప మనసున్న మనిషి. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న బాలయ్య.. సేవ గుణంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే బసవతారకం హాస్పటల్ ద్వారా ఎంతో మంది పేదలకు వైద్య సాయం అందించారు. అంతే కాదు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గం ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారు బాలయ్య. ఇక బాలయ్య అభిమానులు కూడా ఆయనలానే సేవాగుణం లో ముందుంటారు. బాలకృష్ణ పుట్టిన రోజు, లేదన్నా ఏదైనా ప్రత్యేకమైన రోజున అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేస్తుంటారు. అలాంటి ఆర్ధిక సాయం కూడా చేస్తుంటారు బాలయ్య అభిమానులు. తాజాగా బాలకృష్ణ అభిమానులు చేసిన పనికి అందరూ శబాష్ అంటున్నారు.

ఓ పసి పాప ప్రాణాన్ని కాపాడేందుకు బాలయ్య అభిమానులు ముందుకు వచ్చారు. క్యాన్సర్ బారిన పడిన ఓ చిన్నారిని కాపాడేందుకు ఆర్ధిక సాయం చేశారు అభిమానులు. మునుగోడు మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన అయితగోని రవి, మమతా దంపతుల కూతురు ఆరుషీ(20 నెలల పాప) వెన్నుముకలో కణిత ఏర్పడింది. ఏప్రిల్ 27న మెడికవర్ హాస్పటల్ లో సర్జరీ చేసి తొలగించారు వైద్యులు, కానీ అదే భాగంలో మరో కణిత ఏర్పడింది. దాంతో మరోసారి గత నెల 20న సర్జరీ చేసి ఆ కణితను కూడా తొలగించారు వైద్యులు. అయితే ఇప్పుడు ఆ పాపకు మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు కీమో థెరపీ చేయించాలని వైద్యులు సూచించారు.

ఉన్నదంతా పాప వైద్యానికి ఖర్చు చేసిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు కీమో థెరపీ కోసం డబులు లేక ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్జరీలకు రూ. 8 లక్షలకు పైగా ఖర్చు అయ్యాయని.. మరో రూ. 8 లక్షలవరకు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. పాపకు ఒకొక్క కీమోకి రూ. 1.50లక్షల నుంచి రూ. 1.80లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దాతలు సాయం చేసి తమ కూతురిని కాపాడాలని వేడుకుంటున్నారు. కాగా పాప ఆరోగ్య సమస్య తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆ చిన్నారికి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. బాలయ్య అభిమానులు రూ. 50 వేల ఆర్ధిక సాయం అందించారు. అలాగే చిన్నారి ప్రాణం కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని బాలయ్య అభిమానులు కోరుతున్నారు. సాయం చేయడం కోసం 39905920603 ఐఎఫ్స్‌సీ- ఎస్‌బీఐ 011984  లేదా 6300355536 ( పాప తండ్రి రవి ) నెంబర్‌కు గూగుల్ పే ద్వారా సాయం అందించాలని వేడుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.