Akhanda : బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకెళ్తున్న బాలయ్య.. త్వరలో సీక్వెల్ కూడా..
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండంగా గర్జిస్తున్నారు. బాలయ్య దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి.
Akhanda : నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండంగా గర్జిస్తున్నారు. బాలయ్య దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. అఖండ ఘనవిజయం సాధించింది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత విడుదలైన పెద్ద సినిమా అఖండ కావడం అదికూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టాలీవుడ్ కు నూతన ఉత్సాహం వచ్చింది. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని విభిన్నమైన పాత్రలో నటించాడు బాలయ్య. రోజులు గడుతున్నా.. అన్ స్టాపబుల్ అంటూ థియేటర్ల దుమ్ము దులుపుతుంది ఈ సినిమా. ఇక అఖండలో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహ , లెజెండ్ సినిమాలను అఖండ బీట్ చేసింది. టాక్ పరంగా, వసూళ్ల పరంగా అఖండ దూసుకుపోతుంది.
బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటిని మరో సినిమా బాలయ్యతో చేయాలనీ అభిమానులు కోరుతున్నారు. అఖండ ఇంకా థియేటర్లో ఉండగానే మరో సినిమా చేయమని బోయపాటిని రిక్వెస్ట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా చివరిలో ఎక్కడ అన్యాయం జరిగిన నేను వస్తా అంటూ ఆయన వెళ్లిపోవడం చూపించారు. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే స్కోప్ ఉంది. దాంతో ఇప్పుడు సీక్వెల్ ఉండొచ్చు అనే దానిపై చర్చ రాజుగుతుంది. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాకోసం బడా నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయని తెలుస్తుంది. ఇక అఖండ సినిమా త్వరలో ఓటీటీల్లో విడుదల కానుందని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :