వరద బాధితులను ఆదుకునేందుకు కదిలిన సినీలోకం.. విరాళం ప్రకటించిన నాగవంశీ, త్రివిక్రమ్ , చిన్నబాబు

ఎటుచూసినా నడుములోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో రెండ్రోజులుగా నడుములోతు నీరు చేరడంతో బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ఆహారం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

వరద బాధితులను ఆదుకునేందుకు కదిలిన సినీలోకం.. విరాళం ప్రకటించిన నాగవంశీ, త్రివిక్రమ్ , చిన్నబాబు
Naga Vamsi , Trivikram, Rad
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 03, 2024 | 1:02 PM

ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను నగరాన్ని వరద ముంచెత్తింది. విజయవాడలోని పలు ఏరియాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.. ఎటుచూసినా నడుములోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో రెండ్రోజులుగా నడుములోతు నీరు చేరడంతో బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో ఆహారం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. విజయవాడలో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్‌లతో ఆహారం సరఫరా చేస్తున్నారు. పెద్దయెత్తున ప్రభుత్వం పాలు, వాటర్‌, ఆహారపొట్లాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

లక్షలాది మంది బాధితులు ఉండటంతో ఈ ఉదయం నుంచి ఆహార పంపిణీ స్పీడప్‌ చేశారు. అయినా కూడా కొందరికి ఆహార పొట్లాలు అందరికీ అందడం లేదు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. రెండు రోజులుగా సిగ్నల్స్ లేక ఫోన్లు కూడా పనిచేయడం లేదు. కేవలం విజయవాడలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రల్లో పలు ప్రాంతాలు ఇలానే ఉన్నాయి. దాంతో వరద బాధితులకు ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందుకు వస్తోంది.

ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయానిధికి రూ. 25 లక్షలు అందజేశారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటిరూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఏపీకి రూ. 50 లక్షలు, అలాగే తెలంగాణకు రూ. 50లక్షలు సాయం చేశారు తారక్. తాజాగా సితార ఎంటర్టైమెంట్స్( నాగవంశీ), హారిక అండ్ హాసిని( రాధాకృష్ణ) అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల వరదబాధితులను ఆదుకునేందుకు రూ. 50 లక్షలు సాయం(ఏపీకి రూ. 25 లక్షలు, అలాగే తెలంగాణకు రూ. 25లక్షలు) సాయం చేశారు అందించారు. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా వరదబాధితులకు ఆడుకుందుకు ముందుకు వస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.