Naa Saamiranga: ‘ఈసారి పండక్కి నా సామిరంగ’.. సంక్రాంతికి నాగార్జున మాస్ జాతరే.. ట్రైలర్ చూశారా ?..
కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇదివరకు రిలీజ్ అయిన సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కాసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈసారి పండక్కి నా సామిరంగ అంటూ వచ్చేస్తున్నాడు టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున. ఘోస్ట్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న కింగ్.. ఇప్పుడు సంక్రాంతికి మాస్ జాతర అంటూ రాబోతున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇదివరకు రిలీజ్ అయిన సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కాసేపటి క్రితం ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈసారి సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అని తెలుస్తోంది.
ట్రైలర్ లో పచ్చని పొలాలు, కోడి పందేలు, స్నేహం, ప్రేమ, గొడవలు, సవాళ్లు అన్నింటిని చూపించారు. అలాగే ఈసారి నాగార్జున ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కిష్టయ్యగా మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ మరోసారి తన యాక్టింగ్ తో అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఆషికా రంగనాథ్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈసారి సంక్రాంతికి పర్ఫెక్ట్ సూపర్ హిట్ మూవీతో రాబోతున్నాడు కింగ్.
🔥ఈసారి పండక్కి నా సామి రంగ!🔥#NaaSaamiRangaTrailer!
▶️ https://t.co/gc6N8rpOO7#NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi@allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @SS_Screens @boselyricist pic.twitter.com/K943LPkpMO
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 9, 2024
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాగార్జునకు ఈసారి సంక్రాంతి పండగ సందర్భంగా నా సామిరంగ భారీ విజయాన్ని అందించడం ఖాయమని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.