Naa Saamiranga: నాగార్జున సర్ప్రైజ్ అదిరిపోయింది.. ‘నా సామిరంగ’లో మరో యంగ్ హీరో.. టీజర్ చూశారా ?..
కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వీడియోస్, గ్లింప్స్ చూస్తుంటే.. ఎప్పటిలాగే.. ఈసారి సంక్రాంతి పండక్కి నాగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘నా సామిరంగ’. ఘోస్ట్ సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని నాగ్ నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్‌లోకి వచ్చేశాడు నాగ్. పొడవాటి జుట్టు.. గడ్డంతో మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. ఇందులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వీడియోస్, గ్లింప్స్ చూస్తుంటే.. ఎప్పటిలాగే.. ఈసారి సంక్రాంతి పండక్కి నాగ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నరేష్ ఇంట్రక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇందులో అంజి పాత్రలో నరేష్.. మరోసారి అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. నాగ్, అల్లరి నరేష్ కాంబోలో వచ్చే సీన్స్ చూస్తే వీరిద్దరి స్నేహితులుగా.. బంధువులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నరేష్ తోపాటు.. మరో యంగ్ హీరో ఉన్నట్లు టీజర్ రిలీజ్ చేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఆ హీరో ఎవరో కాదు.. యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ తో మరిన్ని అంచనాలు పెంచేశారు.
అంజి గాడు!! ఆడి అన్నయ్య కలిసొస్తే🔥🔥
Enjoy our MASSively Entertaining #NaaSaamiRangaTeaser 😊
▶️ https://t.co/z7sKao2uY4#NaaSaamiRanga #NSRForSankranthi
KING👑 @iamnagarjuna @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @srinivasaaoffl @JungleeMusicSTH pic.twitter.com/CIVAX5LKXV
— Allari Naresh (@allarinaresh) December 17, 2023
ఈ సినిమాలో అల్లరి నరేష్ జోడిగా మిర్నా మీనన్ నటిస్తుంది. రాజ్ తరుణ్ సరసన ఎవరనేది ఇంకా రిలీవ్ చేయలేదు. ప్రస్తుతం విడుదలైన నా సామిరంగ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నా సామిరంగ సినిమా.. ప్రేమకథతోపాటు.. కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉండనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. మరీ ఈసారి సంక్రాంతికి నాగార్జున ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.