Megastar Chiranjeevi: తమ్ముళ్లతో మెగా పవర్ స్టార్… వరుణ్ తేజ్, అకీరా మధ్యలో రామ్ చరణ్.. ఫోటో అదిరింది..

మెగా వారసులంతా ఈ సెలబ్రేషన్లలో సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, శిరీష్, అల్లు అర్జున్, అకీరా నందన్, ఆద్య, నిహారికా, ఉపాసన, స్నేహారెడ్డి ఇలా అందరూ ఒక్కచోట చేరి సంక్రాంతి పండగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈవేడుకలలో చరణ్ గారాలపట్టి క్లింకారా మరింత స్పెషల్ అట్రాక్షన్ కాగా..

Megastar Chiranjeevi: తమ్ముళ్లతో మెగా పవర్ స్టార్... వరుణ్ తేజ్, అకీరా మధ్యలో రామ్ చరణ్.. ఫోటో అదిరింది..
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 17, 2024 | 8:36 AM

మెగా ఫ్యామిలీ ఈసారి సంక్రాంతి పండగను ప్రత్యేకంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. బెంగుళూరులోని ఫాంహౌస్‏లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలలో అల్లు కుటుంబం కూడా పాల్గొంది. మెగా వారసులంతా ఈ సెలబ్రేషన్లలో సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, శిరీష్, అల్లు అర్జున్, అకీరా నందన్, ఆద్య, నిహారికా, ఉపాసన, స్నేహారెడ్డి ఇలా అందరూ ఒక్కచోట చేరి సంక్రాంతి పండగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈవేడుకలలో చరణ్ గారాలపట్టి క్లింకారా మరింత స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అటు పవన్ తనయుడు అకీరా నందన్ తన న్యూలుక్‏తో కనిపించి వింటేజ్ పవర్ స్టార్ ను గుర్తు చేశాడు.

ఇదిలా ఉంటే.. అటు ఈ సెలబ్రేషన్లకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. మెగా బ్రదర్స్ అంతా ఒక్కచోట ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ ఫోటోలో స్పెషాలిటీ ఏంటీ అనుకుంటున్నారా ?.. అందులో మెగా వారసులు ముగ్గురు ఒకే చోట కనిపించారు.

మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సెల్ఫీ తీసుకుంటుండగా.. వారిద్దరి వెనక రామ్ చరణ్, అకీరా నందన్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అకీరా, చరణ్ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటుండగా.. ఆ వెనకాలే ఆద్య, సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. ఇక చెర్రీ పక్కనే వరుణ్ తేజ్, అల్లు శిరీష్, అలాగే చరణ్ ముందు ఉపాసన కూర్చున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. మెగా వారసులతో మెగా సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఇదే వేడుకలలో మెగా ప్రిన్సెస్ క్లింకారాతో శ్రీవల్లీ పాటకు డాన్స్ చేస్తూ ఆటలాడింది అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ. ఇందుకు సంబంధించి వీడియో సైతం మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. అలాగే యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం అనే పాటను పియానో ప్లే చేసి అందరినీ ఆకట్టుకున్నాడు అకీరా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.