AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు నక్సల్‌ స్టోరీ.. మరో సంచలన సినిమాతో అదా శర్మ.. రిలీజ్‌ డేట్‌ ఇదే

కేరళలో జరిగిన మతమార్పిడులు, లవ్‌ జిహాద్‌ అంశాలపై ది కేరళ స్టోరీ తెరకెక్కింది. వివాదాలెన్నీ చుట్టుముట్టినా రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది అదాశర్మ సినిమా. ఇప్పుడీ సెన్సేషన్ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. 'ది కేరళ స్టోరీ' హిట్ తర్వాత నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్, నటి అదా శర్మ కలిసి 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'.

Adah Sharma: అప్పుడు కేరళ స్టోరీ.. ఇప్పుడు నక్సల్‌ స్టోరీ.. మరో సంచలన సినిమాతో అదా శర్మ.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Bastar The Naxal Story
Basha Shek
|

Updated on: Feb 10, 2024 | 3:55 PM

Share

హార్ట్‌ ఎటాక్‌ బ్యూటీ అదాశర్మ నటించిన ‘ ది కేరళ స్టోరీ ‘ చిత్రం 2023లొ ఒక చిన్న సంచలనమే సృష్టించింది. దేశంలోని ఒక వర్గం వారు ఈ సినిమాను వ్యతిరేకిస్తే, మరో వర్గం వారు ఈ మూవీని అభినందించారు. కేరళలో జరిగిన మతమార్పిడులు, లవ్‌ జిహాద్‌ అంశాలపై ది కేరళ స్టోరీ తెరకెక్కింది. వివాదాలెన్నీ చుట్టుముట్టినా రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది అదాశర్మ సినిమా. ఇప్పుడీ సెన్సేషన్ కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. ‘ది కేరళ స్టోరీ’ హిట్ తర్వాత నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా, దర్శకుడు సుదీప్తో సేన్, నటి అదా శర్మ కలిసి ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. మార్చి 15న అదాశర్మ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మేకర్స్‌ రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్‌లో అదా శర్మ తుపాకీతో మెరిసింది. సైనిక దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక మరో పోస్టర్‌లో గుమ్మానికి వేలాడుతోన్న కొందరి మృతదేహాలు కనిపించాయి. మొత్తానికి ది కేరళ స్టోరీ లాగే ఇది కూడా సంచలనం సృష్టించేలా ఉంది.

ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేసి షేర్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలను కూడా పంచుకున్నాడు. నక్సలైట్ల కథను సినిమాలో చూపించాం. ఇది కూడా యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన స్పెషల్ మూవీ. బస్తర్ చండీగఢ్‌లోని ఒక ప్రాంతం. ప్రభుత్వ మైనింగ్ మాఫియా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా నక్సల్స్ పోరాడనున్నారు. ఇదే కథను ‘బస్తర్‌’లో చూపించనున్నారు. అదా శర్మ ఇంతకు ముందు చాలా గ్లామర్ తరహా పాత్రలు చేసింది. అందం, అభినయం పరంగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే ది కేరళ స్టోరీలో మాత్రం ఇస్లాం మతంలోకి మారిన హిందూ అమ్మాయి పాత్రను పోషించి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆమె యాక్షన్ అవతార్‌లో కనిపించడానికి సిద్ధంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మావోయిస్టుగా అదా శర్మ..

మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..