AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varudu Kaavalenu: ‘నేను లవర్ బాయ్ ఇమేజ్‌కు దూరం’.. నాగశౌర్య ఆసక్తికర కామెంట్స్..

కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది వరుడు కావలెను సినిమా.

Varudu Kaavalenu: 'నేను లవర్ బాయ్ ఇమేజ్‌కు దూరం'.. నాగశౌర్య ఆసక్తికర కామెంట్స్..
Naga Shourya
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2021 | 8:45 PM

Share

Varudu Kaavalenu: కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది వరుడు కావలెను సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని తమ సినిమాకు మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు

సందర్భంగా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ ..”మా మూవీ టీమ్ అంతా ఒక మహిళైన నన్ను నమ్మి సపోర్ట్ చేసి సినిమా చేయించారు. అక్కా అని పిలిచే నాగశౌర్య నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను అన్నారు. చినబాబు గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం, సితార లాంటి మంచి సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు సౌజన్య. సినిమా సక్సెస్ చేసి మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నా అని అనుకుంటున్నాను. మేము కథలో అనుకున్న భావోద్వేగాలు స్క్రీన్ మీద పండాయి. సకుటుంబంగా థియేటర్లకు వస్తూ మా చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. అన్ని వయసుల ఆడియెన్స్ హాయిగా చూసే సినిమా అని చెబుతున్నారు. ఇదే కాదు భవిష్యత్ లో నేను చేయబోయే సినిమాలు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా ఉంటాయి అని చెప్పుకొచ్చారు సౌజన్య.

అలాగే హీరో నాగశౌర్య మాట్లాడుతూ ..‘వరుడు కావలెను’ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని మొదటి నుంచీ బలంగా నమ్మాను అని అన్నారు. ఇవాళ మా నమ్మకం నిజమైంది. ‘వరుడు కావలెను’ చిత్రాన్ని చూసి ఆదరించిన ప్రేక్షకులకు, చూడబోయే ప్రేక్షకులకు కూడా థాంక్స్ చెబుతున్నా. థియేటర్లకు వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా బాగా నచ్చింది. సినిమా బాగుంది అనే టాక్ పెరుగుతోంది. ‘వరుడు కావలెను’ చిత్రంతో మీకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్లదే కాదు, ఎంతోమంది తెర వెనక పనిచేశారు వాళ్లందరికీ విజయంలో భాగముంది. నేను లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం. ఎందుకంటే హీరోగా అన్ని రకాల కథలు, పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు శౌర్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar : ఇప్పటి వరకూ కేవలం తల్లిగా ఒక పాత్రే.. ఇకపై తన కూతుళ్లకు తండ్రిగానూ..

Pushpaka Vimanam: పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ లైవ్.. చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!