Naga Chaitanya: ఫెరారీ కారులో నాగచైతన్య రైడ్.. ఆ కారు ధరెంతో తెలుసా ?.. వీడియో వైరల్..
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి చెప్పక్కర్లేదు. లగ్జరీ కార్లంటే ఆయనకున్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఇప్పటికే చైతూ వద్ద అనేక రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫెరారీ. ఇటీవలే తన ఫెరారీ కారులో జూబ్లీ హిల్స్‌లోని ఒక పెట్రోల్ బంకులో కనిపించాడు. 2018లో కొనుగోలు చేసిన ఈ కారు ఇప్పటికీ చైతూ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు స్టైలీష్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో ఆ కారు ధర సైతం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. నివేదికల ప్రకారం ఆ లగ్జరీ ఫెరారీ కారు ధరూ భారతదేశంలో

సాధారణంగా సెలబ్రిటీలు, ముఖ్యంగా నటీనటులు విలాసవంతమైన కార్ల పట్ల విపరీతమైన ప్రేమను కలిగి ఉంటారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ సినీతారలు ఎక్కువగా కార్లు, వాచ్‌లు, ఆటోమొబైల్స్ ను ఇష్టపుడుతుంటారు. మన తెలుగు హీరోల వద్ద అనేక రకాల లగ్జరీ కార్లు, బైక్స్ ఉన్నాయి. ఎప్పుడూ తమ గ్యారేజీలో సరికొత్త విలాసవంతమైన లగ్జరీ కార్లను చేరుస్తుంటారు. ఈ విలాసవంతమైన ఆటోమొబైల్స్ పట్ల వారికున్న ప్రగాఢమైన అభిరుచిని ప్రతిబింబిస్తుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య గురించి చెప్పక్కర్లేదు. లగ్జరీ కార్లంటే ఆయనకున్న ప్రేమ అందరికీ తెలిసిందే. ఇప్పటికే చైతూ వద్ద అనేక రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో ఒకటి ఫెరారీ. ఇటీవలే తన ఫెరారీ కారులో జూబ్లీ హిల్స్‌లోని ఒక పెట్రోల్ బంకులో కనిపించాడు. 2018లో కొనుగోలు చేసిన ఈ కారు ఇప్పటికీ చైతూ వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు స్టైలీష్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో ఆ కారు ధర సైతం ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. నివేదికల ప్రకారం ఆ లగ్జరీ ఫెరారీ కారు ధరూ భారతదేశంలో రూ. 3.6 నుండి 4 కోట్లు ఉంటుందని సమాచారం. కేవలం ఫెరారీ మాత్రమే కాకుండా చైతూ వద్ద అనేక రకాల బైక్స్ సైతం ఉన్నాయి. స్పోర్ట్స్ బైక్స్ ఎక్కువగా చైతూ వద్ద ఉంటాయి. చైతూ వద్ద ఉన్న కార్స్ కలెక్షన్ పై ఓ లుక్కెయ్యండి.
నాగ చైతన్య కార్ కలెక్షన్
ఫెరారీ 488 GTB
BMW 740Li
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
నిస్సాన్ GT-R
పోర్షే పనామెరా టర్బో – ఎస్
పోర్షే కయెన్నే టర్బో
మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్
View this post on Instagram
ఇక చైతూ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా..ఇప్పటికే చైతూ నటించిన ధూత వెబ్ సిరీస్ సైతం స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




