Tollywood: ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఆమెనే సెన్సెషన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలుగులో మొదటి చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ మూవీ తర్వాత వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన బాబుతో సమయం గడుపుతుంది. అయితే నెట్టింట మాత్రం ఫుల్ యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఫోటో తెగ వైరలవుతుంది. ఆమె పాన్ ఇండియా హీరోయిన్. తెలుగులో మొదటి చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ మూవీ తర్వాత వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన బాబుతో సమయం గడుపుతుంది. అయితే నెట్టింట మాత్రం ఫుల్ యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ ఇలియానా. కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే కథానాయికగా కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్ పరిశ్రమలో కూడా పాపులర్. ఇలియానా 1 నవంబర్ 1987న ముంబైలో జన్మించింది. మోడలింగ్‌తో కెరీర్‌ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె తన మొదటి సౌత్ చిత్రం ‘దేవదాసు’కి ఉత్తమ తొలి నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా ఒకప్పుడు అనారోగ్యంతో బాధపడుతోందని మీకు తెలుసా? ఇలియానా స్లిపింగ్ డిజార్డర్‌తో బాధపడుతోంది.
ఇలియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. కొంతకాలం క్రితం ఆమె స్వయంగా స్లిపింగ్ డిజాస్టర్ గురించి తెలియజేసింది. ఇలియానాకు నిద్రలో నడవడం అలవాటు. ఈ అలవాటు వల్ల ఆమె చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తరచుగా ఆమె పాదాలు కూడా వాపు లేదా గాయపడతాయి. చివరగా, అనేక చికిత్సల తర్వాత, ఆమె దానిని అధిగమించింది. ఇలియానా స్వస్థలం గోవా. ఆమె గోవాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె ముంబైకి వచ్చింది. 2006లో ఆమె తెలుగులో ‘దేవదాసు’ చిత్రంలో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 2012లో అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
View this post on Instagram
ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే తన వ్యక్తిగత జీవితం కారణంగా ఆమె నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజుల క్రితం ఆమె ఓ అందమైన అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమె మేలో మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలియానా తమ కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టారు. ఇలియానా గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో చాలా సంవత్సరాలు డేటింగ్ చేసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా చర్చ జరిగింది. అయితే 2019లో విడిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



