AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: నెలకు కేవలం రూ.5 వేల డిపాజిట్‌తో రూ.8 లక్షల ఆదాయం.. లక్షాధికారిని చేసే స్కీమ్!

Post Office Scheme: మీరు మీ పెట్టుబడుల నుండి మంచి రాబడిని సంపాదించాలనుకుంటే, సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు సరైన ఎంపిక కావచ్చు. ఎందుకంటే అవి సురక్షితమైన పెట్టుబడులుగా పరిగణిస్తారు. అనేక పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ఒకటి రికరింగ్ డిపాజిట్ ప్లాన్ ఒకటి..

Post Office: నెలకు కేవలం రూ.5 వేల డిపాజిట్‌తో రూ.8 లక్షల ఆదాయం.. లక్షాధికారిని చేసే స్కీమ్!
Postal Scheme
Subhash Goud
|

Updated on: Feb 09, 2026 | 8:00 AM

Share

Post Office Scheme: డబ్బు సంపాదించేందుకు రకరకాల ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఈ స్కీమ్‌లలో తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో మెచ్యూరిటీ తర్వాత లక్షలాది రూపాయలు సొంతం చేసుకోవచ్చు. అలాంటి పథకాలు పోస్టాఫీసులలో చాలా ఉన్నాయి. ఎలాంటి రిస్క్‌ లేకుండా ప్రభుత్వ హామీతో ఉండే పథకాలలో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒకటి.

ప్రతి నెల 5వేల రూపాయల చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తే మంచి రాబడి పొందచ్చు. ఈ పెట్టుబడిని ఐదు సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం ఈ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ అందజేస్తుంది. ఐదు సంవత్సరాల పాటు మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ.3,56,830 లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే..

ఈ స్కీమ్‌ను పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం మీరు పెట్టిన పెట్టుబడి రూ.6,00,000 అవుతుంది. అంటే నెలకు రూ. 5000 చొప్పున డిపాజిట్ చేస్తుంటే మొత్తం కాలపరిమితి 120 నెలలు. దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.

ఇలా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పోస్టాఫీసు స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తే పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులు, ఇంటి నిర్మాణం కోసం ఇలా ఎన్నో రకాల వాటికి ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: రైలు ప్రయాణంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా..? చట్టం ఏం చెబుతోంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి