Lambasingi: మరోసారి కట్టిపడిసిన సిద్ శ్రీరామ్.. ఆకట్టుకుంటున్న ‘లంబసింగి’పాట..

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే... అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది.

Lambasingi: మరోసారి కట్టిపడిసిన సిద్ శ్రీరామ్.. ఆకట్టుకుంటున్న ‘లంబసింగి’పాట..
Divi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 18, 2022 | 10:25 AM

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.’లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్ తన్నీరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ ప్యూర్ లవ్ స్టోరీ… అనేది ఉపశీర్షిక. ఇందులోని తొలి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

రొమాంటిక్ మెలోడీగా రూపొందిన ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ పాట అందరికీ ప్రేక్షకులు అందరికీ నచ్చేసింది. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘నచ్చేసిందే నచ్చేసిందే… నాకెంతో నచ్చిందే ఈ పిల్ల.. అంటూ సాగిన ఈ గీతానికి కాస్లర్య శ్యామ్ సాహిత్యం అందించారు. కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “నా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ నిర్మించిన సినిమా ‘లంబసింగి’. ఇందులో ‘బిగ్ బాస్’ దివి కథానాయికగా నటించింది. ఇందులో తొలి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ను వినండి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు. ఇక ఈ సినిమాలో వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

Soundarya Death Anniversary: చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. నేడు సౌందర్య వర్థంతి

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!