S. Thaman: ‘సర్కారు వారి పాట కోసం మా కష్టం వృధా కాలేదు’.. తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

S. Thaman: 'సర్కారు వారి పాట కోసం మా కష్టం వృధా కాలేదు'.. తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: May 01, 2022 | 7:10 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ స్వరకల్పనలో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

తాజాగా ‘సర్కారు వారి పాట’ మ్యూజికల్ సెన్సేషన్ తమన్ మీడియాతో ముచ్చటించారు. తమన్(S. Thaman)మాట్లాడుతూ.. భారీ అంచనాలు వుండటం ఒక ఇష్యూ. ఆ అంచనాలు అందుకోవడం కోసం ఏదైనా స్పెషల్ స్కూల్ వుంటే బావున్ననిపిస్తుంటుంది. మ్యూజిక్ చేయడమే కాకుండా దాన్ని చక్కగా ప్రమోట్ చేసి జనాల దగ్గరికి తీసుకెళ్ళడం కూడా ఒక భాద్యతగా మారింది అన్నారు. చెవులకి మాత్రమే కాదు మేము కూడా కనిపించాల్సిన తప్పనిసరి పరిస్థితిలోకి వచ్చేశాం. ఒక్క పాట 150 మిలియన్ వ్యూస్ సాధించడం అంత తేలిక విషయం కాదు. సినిమాలే కాదు పాటలు కూడా పాన్ ఇండియా అయిపోయాయి. ఒక పాట రీచ్ అవాలంటే.. అది గ్లోబల్ గా ఉందా ? ఎవరు పాడుతున్నారు ? ఇలా చాలా అంశాలు వుంటాయి. ఈ భాద్యతలన్నీ తీసుకోవాల్సివస్తుంది. చాలా కష్టం.. అయితే ఇప్పుడు మంచి విషయం ఏమిటంటే.. డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తున్నాయి. దీంతో ఒకేలా కాకుండా డిఫరెంట్ గా అలోచించే అవకాశం వుంది. జోనర్స్ మారడం వలన మ్యూజిక్ కూడా డిఫరెంట్ జోనర్స్ లో వస్తుంది. సర్కారు వారి పాట విషయానికి వస్తే ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా. సినిమా మొత్తం స్పార్క్ తగ్గనే తగ్గదు. సినిమా అంతా షైనింగ్ కనిపిస్తూనే వుంటుంది. సర్కారు వారి పాట పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అన్నారు తమన్.

కళావతి 2020 లాక్ డౌన్ లో చేసిన పాట. నేను, దర్శకుడు పరశురాం , గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను ఇది. నాకు సామజవరగమనా , దర్శకుడు పరశురాం కి ఇంకేం ఇంకేం కావాలె లాంటి మేలోడిస్ వున్నాయి. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా అంచనాలతో వుంటారు, అన్నిటికంటే ముఖ్యం మహేష్ బాబు గారు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్..ఇది చాలా ప్యూర్ గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం. అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం అన్నారు. అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. ఈ గ్యాప్ లో పాటకు రోజు ప్రాణం పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం. మా కష్టం వృధా కాలేదు. ఫాస్టెస్ట్ గా 150మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి కళావతి పాట అందరినీ అలరించింది అని తమన్ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

HBD Ajith Kumar: ఆ స్పెషల్ ఉంగరమంటేనే ఇష్టమంటోన్న అజిత్.. మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Niharika: సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నిహారిక.. నేర్చుకున్న పాఠాలు ఇవేనంటూ పోస్ట్..

Sathyadev: కనిపించింది పది నిముషాలే కానీ.. చిరంజీవికే గురువు అయిపోయాడు.. మరోసారి మెగాస్టార్ సినిమాలో యంగ్ హీరో..