ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సృష్టించిన సెన్సెషన్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు చిత్రపరిశ్రమ నుంచి అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకోవడం వరకు ఆర్ఆర్ఆర్ చిత్రప్రయాణం అద్భుతం. డైరెక్టర్ రాజమౌళి టేకింగ్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకులు.. విదేశీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల అమెరికాలో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును విశ్వవేదికపై ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు కీరవాణి. LA క్రిటిక్స్ సర్కిల్లో ఏంఏం కీరవాణి బెస్ట్ స్కోర్ పొందారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది.
లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్’లో ఆర్ఆర్ఆర్ సినిమా పలు క్యాటగిరీలో ఎంపిక అయ్యింది. అయితే ఈ రేస్ లో ఎం ఎం కీరవాణి ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’గా అవార్డుని అందుకున్నాడు. ఈ అవార్డుని గత ఏడాది డిసెంబర్ లోనే ప్రకటించింది అసోసియేషన్. తాజాగా ఈ అవార్డుని కీరవాణి లాస్ ఏంజెల్స్ లో అందుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ సినిమా కాదని..తెలుగు సినిమా అని క్లారిటీ ఇచ్చారు. అమెరికాలోని ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బాలీవుడ్ సినిమా అంటూ చెప్పడంతో జక్కన్న రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా బాలీవుడ్ కాదు.. తెలుగు సినిమా. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. నేను అక్కడి నుంచే వచ్చాను అని చెప్పారు. దీంతో జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాను తెలుగు చిత్రం అంటూ గర్వంగా చెప్పడంతో సౌత్ ఇండియా ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఈ సినిమాకు సిక్వెల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుందని అన్నారు. అయితే ట్రిపుల్ ఆర్ సిక్వెల్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. నటీనటుల గురించి వివరాలు అనౌన్స్ చేయలేదు .
Congratulations to our Music Director @MMKeeravaani on winning the Award for BEST MUSIC/SCORE for #RRRMovie at @LAFilmCritics !! ? ? ? ? pic.twitter.com/mcylG0GdBM
— RRR Movie (@RRRMovie) January 15, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.